కృష్ణ

దివిసీమలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 13: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం దివిసీమలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మండల పరిధిలోని అవనిగడ్డ శ్రీ రాజశేఖర స్వామి ఆలయం, వేకనూరులోని శ్రీ ఉభయ ముక్తేశ్వర స్వామి, ఎడ్లలంకలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయాలలో తెల్లవారు జాము నుండే స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లలంకలోని కృష్ణానది తీరంలో దాదాపు 50వేల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తడంతో బారులుతీరిన దృశ్యాలు కనిపించాయి. పితృదేవతలకు పూజలు నిర్వహించి పిండ ప్రదానాలు చేశారు. స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పులిహోర పోట్లాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఉద సభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ శ్రీరాజశేఖర స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని బుద్ధప్రసాద్ ప్రారంభించగా దాదాపు 20వేల మంది భక్తులు సమారాధనలో పాల్గొన్నారు.

చాలినన్ని బస్సులు లేక భక్తుల ఇక్కట్లు

కూచిపూడి, ఫిబ్రవరి 13: మహా శివరాత్రి సందర్భంగా కూచిపూడి పరిసర గ్రామాలు నుంచి తరలి వచ్చిన వేలాది మంది భక్తులకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా ఆటోల ఇష్టారాజ్యంగా మారింది. మహా శివరాత్రి సందర్భంగా గతంలో కూచిపూడి కేంద్రంగా ఐలూరు, ఐనపూరు పుణ్య స్నానాలకు, శివలయాల సందర్శనాలకు అనుకూలంగా బస్సులు ఏర్పాటుచేసే వారు. అయితే మంగళవారం పామర్రు నుండి బస్సులను ఏర్పాటు చేయటంతో మొవ్వ మండల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఆర్టీసీ బస్సులను ఐలూరులోని శివాలయం సమీపంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించటంతో భక్తులు ఆర్టీసీ బస్సుల పట్ల ఆసక్తి కనపర్చారు. పోలీసు శాఖ ఐలూరు, ఐనపూరుకు లారీలను నిలిపివేయటంతో ఆటోల ఇష్టారాజ్యంగా మారింది. ఏది ఏమైనా కిక్కిరిసిన ఆటోలలో అదనపు చార్జీలు చెల్లించి ఐనపూరులోని కృష్ణానది పుణ్య స్నానాలకు, ఐలూరులో పుణ్య స్నానాలతో పాటు దైవదర్శనం చేసుకోవటానికి భక్తులు తరలి వెళ్లారు.