కృష్ణ

దర్భేశ్వరస్వామికి విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తపేట సైకంవారి వీధిలో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ దర్భేశ్వరస్వామివార్ల ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిమంది భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం నుంచి శ్రీ దర్భేశ్వరస్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తొలుత ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాంపిళ్ల జయప్రకాష్-్భరతి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ శ్రీ దర్భేశ్వరస్వామివార్ల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన క్యూలైన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో వేలాదిమంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారని చెప్పారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశామని చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల కోర్కెలను తీర్చే శ్రీ గంగాపార్వతి సమేత దర్భేశ్వరస్వామివార్లను దర్శించుకుని తరించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా శివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు సైకంవారి వీధిలో బారులుతీరి వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదానార్చకులు మురళి నేతృత్వంలో పలువురు అర్చకులు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయంలో భక్తులు వెలిగించిన దీపాల కాంతితో శ్రీ దర్భేశ్వరస్వామివారి ఆలయం మరింత తేజోవంతంగా ప్రకాశించింది. కాగా శివరాత్రిరోజున రాత్రి శ్రీ దర్భేశ్వరస్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తపేట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఫిషరీస్ కాలనీలో పూరిళ్లు దగ్ధం

మచిలీపట్నం, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని తాళ్లపాలెం పంచాయతీ వైఎస్‌ఆర్ ఫిషరీఫ్ కాలనీ (ఉప్పాడ పాకల)లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాద వశాత్తు జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మత్స్యకార కుటుంబాలకు చెందిన 13 పూరిళ్లు దగ్ధం కాగా 20 కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. గృహాలలోని వలలు, గృహోపకరణాలు, విలువైన పత్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.3లక్షల 30వేల ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. బొందు భగీర్తి, ఎరిపిల్లి అప్పలరాజు, మల్లి బంగారయ్య, గనగళ్ల చిన్నయ్య, తిక్కాడ పుల్లయ్య, అర్జిల్లి ఎల్లారావు, గరిజన కాశీరావు, వాసుపల్లి రమణ, దోనే జాన్, మైలపల్లి నూకరాజు, గనగళ్ల బుజ్జి, తిక్కాడ అప్పారావులకు చెందిన పూరిళ్లు దగ్ధంకాగా ఈ గృహాలలో నివాసం ఉంటున్న 20 మంది బాధితులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. సమాచారం తెలుసుకున్న మంత్రి రవీంద్ర సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి రవీంద్రతో పాటు జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం ఉన్నారు.