కృష్ణ

ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి ఉంటే 25 మంది పార్లమెంట్ సభ్యులు తక్షణం రాజీనామా చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని పీసీసీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పిలుపునిచ్చారు. వైసీపీ, టీడీపీ తోడుదొంగలుగా ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి అవసరమైన అన్ని వనరులు కేటాయిస్తూ, ప్రత్యేక హోదాను కల్పించే విధంగా పార్లమెంట్‌లో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు 15 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గళమెత్తిన నేటి ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు నేడు వౌనం వహించారని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా నరేంద్రమోదీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సమక్షంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీనిని నెరవేర్చటంలో బీజేపీ, సాధించటంలో టీడీపీ ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నాయని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు, వివిధ కేసుల్లో ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్డి రాష్ట్ర అభివృద్ధిని, తెలుగు ప్రజల గౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. విభజన బిల్లులో ఉన్న అంశాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న టీడీపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారన్నారు.

హోదా కోసం ఉద్యమం
ప్రత్యేక హోదా సాధించేందుకు రాష్టవ్య్రాప్తంగా ఉద్యమం చేసేందుకు పీసీసీ ప్రణాళిక రూపొందించిందని రాష్ట్ర మహిళాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ చెప్పారు. ఈ నెల 19 నుండి రాష్ట్రంలోని రెవిన్యూ డివిజన్ కార్యాలయాల ఎదుట ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మున్ముందుగా సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలను ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పాల్గొంటారని వివరించారు. డీసీసీ ఇన్‌చార్జి అధ్యక్షులు పి ఏసుదాసు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, మార్చి 6 నుండి న్యూఢిల్లీలో ధర్నా, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శులు బిడీ రవికుమార్, పాతూరి రవికుమార్, డీసీసీ ఉపాధ్యక్షులు వైఎస్‌ఆర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి పరిమి సాగర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.