కృష్ణ

పెద్దింటమ్మ జాతర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఫిబ్రవరి 16: కొల్లేటి ప్రజల ఇలవేల్పు కొల్లేటి పెద్దింటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. తొలి రోజున అమ్మవారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలను ప్రారంభించిన జయమంగళ వెంకట రమణ, కమ్మిలి విఠలరావు దంపతులకు ఆలయ ఇఓ ఆకుల కొండలరావు నేతృత్వంలో ఆలయ అర్చకులు శేష వస్త్రాలతో సత్కరించారు. గోకర్ణపురంలో కొలువైయున్న శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దింటమ్మ జాతర మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా గోకర్ణేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కొల్లేటికోట పీహెచ్‌సీ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో ఆలయం పక్కన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య సదుపాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యపురాజు గుర్రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు పెనె్మత్స త్రినాథరాజు, కొల్లేటి సంఘాల నాయకులు బలే ఏసురాజు, శృంగవరప్పాడు, పెంచికలపర్రు సర్పంచ్‌లు సీతాంజనేయులు, జయమంగళ సుబ్బరాజు, ఎంపీటీసీ లక్ష్మణరావు, లంకగ్రామాల పెద్దలు పాల్గొన్నారు.