కృష్ణ

జనసంద్రంగా మారిన ‘కొల్లేరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఫిబ్రవరి 18: కొల్లేటి కోట జనసంద్రంగా మారింది. ఎటు చూసినా భక్తజన సందోహమే. కొల్లేరు వాసుల ఇలవేల్పు శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం సెలవు దినం కావటంతో అమ్మవారిని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. అమ్మవారిని దర్శించుకోవటంతో పాటు మొక్కుబడులు చెల్లించుకున్నారు. వేకువ జాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల వసతులు కల్పించారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మంచినీటి సౌకర్యం కల్పించగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు మెడికల్ క్యాంప్‌లు నిర్వహించారు. పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలను మెరుగుపర్చారు. ఆర్టీసీ అధికారులు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం కైకలూరు నుండి సర్కారు కాలువ వరకు ప్రత్యేక సర్వీసులు నడిపారు. అక్కడి నుండి భక్తులు లాంచీల ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఎప్పటికప్పుడు భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షించారు. కైకలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ నేతృత్వంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. అలాగే ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరణ చర్యలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు పేపేటి పరమేశ్వరరావు, వెంకట నాగేశ్వరరావు, ఐలూరి వెంకట్రామయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత సప్తశతి పారాయణదారు శ్రీ్ధర్ శాస్ర్తీ పారాయణ చేశారు. ముదునూరి జానకి రవీంద్ర సుబ్బరాజు, రమాదేవిలు అమ్మవారికి పుష్పాలంకరణ చేశారు.

కోయ సుధ సేవలకు అంతర్జాతీయ పురస్కారం

మైలవరం, ఫిబ్రవరి 18: మైలవరానికి చెందిన సంఘ సేవకురాలు, దక్షిణ భారత ప్రభుత్వేతర స్వచ్చంద సేవా సంస్థల ట్రస్ట్ రీజియన్ ఇన్‌చార్జ్ కోయ సుధకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ క్రియేషన్ అకాడమి సంస్థ, ఫిలాంత్రోఫిస్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో నార్వే దేశానికి చెందిన ప్రతినిధుల ద్వారా ఈఅవార్డును కోయ సుధ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ రంగాలలో సమాజసేవ చేవ చేస్తున్న వారిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా మైలవరానికి చెందిన కోయ సుధ 1993 నుండి సమాజానికి ఉపయోగపడే అనేక సేవాకార్యక్రమాలు చేయటాన్ని గుర్తించిన ఈసంస్థలు ఆమెకు ఈపురస్కారాన్ని అందించారు. ఈకార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నార్వేదేశపు పార్లమెంటు సభ్యురాలు సాల్ఫిడ్ సేవదాన్, కాకినాడ విఆర్ కళాశాల ప్రిన్సిపాల్, లైన్స్ గవర్నర్ రాంబాబు, ఫిలాంత్రోఫిక్ సంస్థ నిర్వాహకులు అద్దంకి రాజారెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయులు పి సురేష్ ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా అవార్డు అందుకున్న కోయ సుధ మాట్లాడుతూ సమాజాభ్యుదయం, మహిళా సాధికారిత, విద్యార్థులలో చైతన్యం వంటి అంశాలపై అనేక సదస్సులు నిర్వహించటం, పేదలకు చేయూత, వృద్ధులు, వికలాంగులకు అండదండలు వంటి కార్యక్రమాలను నిర్వహించటం జరిగిందని, తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయటం ఆనందాన్నిచ్చిందన్నారు. ఈఅవార్డు తనకు సహకరించిన అందరికీ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.