కృష్ణ

ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశంపై ఆదివారం స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మండపంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు పార్టీలు, సంఘాలకు చెందిన నేతలు పాల్గొని ప్రసంగించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచిలాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వీరికి రాష్ట్ర ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసినా ఇంకా పదవులను పట్టుకుని వేలాడటం శోచనీయమన్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని వాటికి లెక్కలు చెప్పటం లేదని కేంద్రం చెప్పటం, కేంద్రం నిధులు ఇవ్వటం లేదని రాష్ట్రం చెప్పటం చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టటం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా తమ పార్టీ ఎంపిలు దశలవారీగా ఆందోళనలు చేయటంతోపాటు ఏప్రిల్ 6న రాజీనామాలు చేయనున్నట్లు తమ నేత జగన్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ నేత కాండ్రకొండ అప్పారావు మాట్లాడుతూ అడ్డగోలు విభజన వల్ల తమ పార్టీ గత ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకుందని, కానీ విభజన సమయంలో పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరుమెదపటం లేదన్నారు. పదవుల మోజులో పడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేసే వరకూ పోరాటం చేస్తామన్నారు. భారతీయ జనతాపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రేగళ్ళ రఘునాధరెడ్డి మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మాటతప్పలేదన్నారు. పోలవరం నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దాని ప్రకారంగానే ఇప్పటి వరకూ నిధులు విడుదల చేయటం జరిగిందన్నారు. అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాణం, ఇతరత్రా పధకాలకు సంబంధించి ఇప్పటి వరకూ దాదాపు లక్షా 75వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, వాటికి సంబంధించి లెక్కలు చెప్పకుండా దాట వేయటం సమంజసం కాదన్నారు. ఆర్యవైశ్య సంఘం మైలవరం మండల అధ్యక్షులు గూడవల్లి రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కోరారు. లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి హంసావత్ భోజ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆంధ్రులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సౌత్ ఇండియా ట్రస్ట్ సభ్యురాలు సుధ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కృష్ణా జిల్లా అధ్యక్షులు యు వెంకట్రావ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పాలకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు మాని ప్రత్యేక హోదా కోసం సంఘటితమై పోరాటాలకు సిద్దం కావాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపరచిన అంశాల అమలుకు కట్టుబడి ఉండాలన్నారు. ఎడిటర్స్ అసోసియేషన్ నాయకులు కృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో పి గౌతంరెడ్డి, సాయి సేవాదళ్ కార్యదర్శి వి బాలాజీ ప్రసాద్, పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు ఎం సుందరరావు, జన వాహిని జాతీయ అధ్యక్షులు ప్రసాద్ బాబు, సీపీఐ నాయకులు బుడ్డి రమేష్, సీపీఎం నేత ఎండి జాని, కాంగ్రెస్ నేత వీరంకి శ్రీ్ధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి వెంకట్రావ్, పలు సంఘాల నేతలు పాల్గొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెబుతూ తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.