కృష్ణ

శ్రీ పెద్దింటమ్మను దర్శించుకున్న ఎంపీ ‘మాగంటి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు: మండల పరిధిలోని కొల్లేటికోటలో వేంచేసియున్న శ్రీ పెద్దింటమ్మ అమ్మవారిని మంగళవారం ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) దర్శించుకున్నారు. అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న మాగంటి బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ ఆకుల కొండలరావు ఎంపీ మాగంటి బాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ కొల్లేరు ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. రూ.14కోట్లతో పెద్దింటమ్మ వారధి నిర్మాణం జరుగుతుందన్నారు. అదే విధంగా రెగ్యులేటర్ కూడా నిర్మించి కొల్లేరు ఎండిపోకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, ఎఎంసీ చైర్మన్ సామర్ల శివకృష్ణ, కొల్లేటి సంఘాల నాయకులు బలే ఏసురాజు, ఎంపీటీసీలు తెంటు వెంకట రమణ, గంగుల శ్రీదేవి, కొత్తూరి విఠల్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

భక్త్భివాన్ని పెంపొందించిన భరతముని జయంతి

కూచిపూడి: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కలావేదికపై మంగళవారం నిర్వహించిన భరతముని జయంతోత్సవం కళాలోకానికి మధురానుభూతి కలిగించింది. కళాకేంద్రం నిర్వాహకురాలు, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత కళారత్న ఏవి బాలకొండలరావు నృత్య దర్శకత్వంలో విశాఖపట్నానికి చెందిన కూచిపూడి కళాకేంద్రం విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు ప్రేక్షకులలో భక్త్భివాన్ని పెంపొందించాయి. జ్యోతి ప్రజ్వలన అనంతరం త్యాగరాజ పంచరత్నమైన ఎందరో మహానుభావులు... అనే అంశాన్ని అనుకుల ఆదిత్య, బుల్లి బ్రహ్మం, వందిత, శ్రావణి, వెనె్నలలు ప్రదర్శించారు. నల్లాన్ చక్రవర్తుల జగన్నాధాచార్యులు విరచిత శ్రీ లలితాంబిక.. అనే శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రాన్ని వందిత, శ్రావణి, వెనె్నలలలు, సుచర్ల లలితా గోపాల్ విరచిత రత్యమైనది రామాయణం.. అనే శ్రీరామకథను ప్రదర్శించారు. కళాకారులను కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవ ప్రసాద్, పుష్పసత్యాలతో దుశ్శాలువలతో అతిథుల ద్వారా సత్కరించారు.