కృష్ణ

ఉద్యమంగా జల సంరక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని జల సంరక్షణ కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ ఇప్పటి వరకూ జరిగిన, రాబోయే కాలంలో జరగాల్సిన పనులను గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో 93 కోట్ల రూపాయల వ్యయంతో నీరు-చెట్టు పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మైలవరంలో మండలంలో 36.43 కోట్ల రూపాయలు, జి కొండూరు మండలంలో 31.09 కోట్లు, రెడ్డిగూడెం మండలంలో 14.77 కోట్లు, విజయవాడ రూరల్ మండలంలో 9.76 కోట్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 1.71 కోట్ల రూపాయలతో పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. నీరు-చెట్టు పధకం కింద ఒక్కొక్క చెరువుకు 20 లక్షల రూపాయల వరకూ కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఇవి కాక 21 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన రహదారులు, తాగునీరు, ఇళ్ళ స్థలాలు, పక్కా ఇళ్ళు, విద్యుత్, పెన్షన్లు, అంగన్‌వాడీ, పాఠశాలల భవనాలకు అదనపు గదులు, పూర్తిస్థాయి మరుగుదొడ్లు వంటి అన్ని పనులను స్పష్టమైన ప్రణాళికలతో పూర్తి చేస్తూ గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా మార్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై రాబోయే రోజులలో నెలవారీగా సమీక్ష నిర్వహించాలని, ఆ సమావేశాలకు తానే స్వయంగా హాజరుకానున్నట్లు మంత్రి ఉమ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు తమతమ ప్రణాళికలను రెండుమూడు రోజులలో సిద్ధం చేయాలని, మరుసటి సమావేశానికి మరింత ప్రగతిని సాధించాలని ఆదేశించారు.
అర్హత కలిగిన అందరికీ ఇళ్ళ స్థలాలు
మైలవరం నియోజకవర్గంలో అర్హత కలిగిన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు మంజూరు చేయనున్నట్లు మంత్రి ఉమ వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు వేల మందికి ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేయటం జరిగిందన్నారు. మార్చి నెలాఖరు నాటికి మరో నాలుగు వేల మందికి పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ళ పట్టాలు అందించిన అందరికీ పక్కా ఇళ్ళను కూడా మంజూరు చేయటం జరుగుతుందన్నారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.