కృష్ణ

ఇళ్ల శంకుస్థాపన విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 23: ఈ నెల 26 నుంచి మార్చి 12 వరకు పక్షం రోజుల పాటు ఎన్‌టిఆర్ గృహాల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహిస్తామని, ఇళ్ళు మంజూరైన లబ్ధిదారులు సమాయత్తం కావాలని మండల ప్రత్యేకాధికారి జి నాగేశ్వరరావు, హౌసింగ్ ఈఈ వెంకట సుబ్బయ్య కోరారు. ఈఈ వెంకట సుబ్బయ్య శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నాగేశ్వరరావు, ఎంపీడీఓ పద్మసుధ, తహశీల్దార్ జి భద్రుని కలిసి సమీక్ష నిర్వహించారు. తోట్లవల్లూరు మండలంలో 367 గృహాలు మంజూరైనా నిర్మాణ పనులు ప్రారంభించలేదని ఈఈ వివరించారు. అందిరిచేత ఇళ్ళ నిర్మాణ పనులను ప్రారంభింపచేసేందుకు ప్రభుత్వం 15 రోజుల పాటు శంకుస్థాపన మహోత్సవాలను చేయాలని ఆదేశించిందని వెంకటసుబ్బయ్య ప్రత్యేకాధికారికి తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ లబ్ధిదారుల శంకుస్థాపనలకు సిద్ధపడాలని కోరారు. ఈఈ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ 2014 జూన్ తరువాత మంజూరు కాకుండా పక్కా గృహాలు నిర్మించుకున్న వారికి ఇపుడు ఇళ్ళు మంజూరు చేస్తారని, తహశీల్దార్, ఎంపీడీఓ మండల హౌసింగ్ ఏఈ కలిసి ఈ జాబితాను తయారు చేయాలని తెలిపారు. మండల హౌసింగ్ ఏఈ శివప్రసాద్ పాల్గొన్నారు.

టీడీపీ నేతల విమర్శలను తిప్పి కొట్టాలి

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 23: కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సగ్గుర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బందరు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సగ్గుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి కేంద్ర ప్రభ్వుం పెద్ద ఎత్తున నిధుల కేటాయించిందన్నారు. అయినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్షాలు కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వీటిని సమిష్టిగా తిప్పికొట్టాలన్నారు. అలాగే మార్చి 2న విజయవాడలో నిర్వహించనున్న బీజేపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బందరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పంతం వెంకట గజేంద్రరావు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కూనపరెడ్డి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు తోట రంగనాధ్, యువజన మోర్చ జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్, లీగల్ సెల్ జిల్లా చైర్మన్ సోడిశెట్టి బాలాజీ, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు కరెడ్ల సుశీల, ఎస్టీ మోర్చ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ పద్మారాజు, గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు పద్మరాజు, పార్టీ నాయకులు ధనలక్ష్మి, వీర్ల కృష్ణ, ఘంటా సతీష్ తదితరులు పాల్గొన్నారు.