కృష్ణ

జిల్లాలో కార్పొరేషన్ల ద్వారా 175 షీ ఆటోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మహిళా సాధికారతలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా మహిళలకు షీ ఆటోలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ రుణాల కన్వీనర్ ఎన్‌వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వతేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50, బీసీ కార్పొరేషన్ ద్వారా 50, కాపు కార్పొరేషన్ ద్వారా 50, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 25 మొత్తం 175 ఆటోలు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. ఆటోలు పొందిన మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వటంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖాధికారుల ద్వారా మంజూరు చేయిస్తామన్నారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఇడీ పెంటోజీరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఈశ్వరరావు పాల్గొన్నారు.

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

జగ్గయ్యపేట: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రైతు నుండి 25 క్వింటాళ్లు కొనుగోలు చేస్తారని, క్వింటాల్‌కు రూ.5450లు ధర నిర్ణయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ మల్లెల గాంధీ, డైరెక్టర్‌లు నూకల బాలకృష్ణ, గంగాధరరావు, కొండ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
వాటర్ వర్క్స్ పనులు పరిశీలన
పట్టణానికి ముక్త్యాల కృష్ణానది నుండి నీరు అందించే మంచినీటి పథకం పనులను హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డబ్ల్యుడిపి కాంక్రీట్ పనులు వచ్చే వారం ప్రారంభిస్తామని, జూలై నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని ఎమ్మెల్యే రాజగోపాల్‌కు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.