కృష్ణ

పేదలకు సాయం చేస్తే పోయేదేముంది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: ఇళ్ళపట్టాలతో పాటు చీరలు కూడా ఇస్తే ఆస్తులు తరిగిపోతాయా? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కట్టుబడిపాలెంలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం మంత్రి ఉమ పాల్గొని 43 మందికి ఇళ్ళపట్టాలను అందచేశారు. ఆయన మాట్లాడుతూ పోయేటప్పుడు తీసుకెళ్ళేదేమీ ఉండదు, పేదోళ్ళకు సాయం చేస్తే చిరకాలం గుర్తుంచుకుంటారని తమ పార్టీ నాయకులకు చురకలు అంటించారు. త్వరలో సాధికార మిత్రలతో చీరలు అందజేస్తారన్నారు. లేదా తానే స్వయంగా చీరలు పంపిస్తానన్నారు. రోడ్డు మీద కారు అంతరిక్షంలోకి పంపిస్తుంటే, సూర్యరశ్మి, గాలి నుంచి విద్యుత్ ఉత్పాదన చేస్తుంటే కనీసం కట్టుబడిపాలెంలో మైకు కూడా సరిగా పనిచేయడం లేదని చమత్కరించారు. అడిగినన్ని నిధులు ఇస్తున్నామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇళ్ళను కూడా మంజూరు చేస్తామని, ఇసుక ఉచితమని, ఇటుకరాళ్ళు రూ.3లకే ఇప్పిస్తామన్నారు. ఏ సమస్య ఉన్నా 1100కు కాల్ చేసి చెప్పాలన్నారు. అవినీతిపై, సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అనంతరం కవులూరులో ఇళ్ళపట్టాల పంపిణీ, పీఏసీఎస్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉమ పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాగునీటిని సకాలంలో అందిస్తున్నామన్నారు. గోదావరి జలాలతో ఎకరానికి 45 బస్తాల వరకూ పండించిన రైతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కె సుధారాణి, సర్పంచ్ దాసరి కమల, ఎంపీటీసీ లకావత్ వాసవి, టీడీపీ సీనియర్ నేత జువ్వా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.