కృష్ణ

వేడెక్కుతున్న ‘నీటి’ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం కారణంగా తామంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మొక్కజొన్న రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. శుక్రవారం అవనిగడ్డలో వందలాది మంది రైతులు అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాలకుల వైఫల్యాన్ని, అధికారుల ఉదాశీన వైఖరిని ఎండగట్టారు. రైతుల ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాలు సంఘీభావం తెలపటంతో ఉద్యమం మరింత వేడెక్కింది. గత వారం పది రోజులుగా తాము సాగునీరు ఇవ్వాలని గొంతెత్తి చాటుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ తుంగలవారిపాలెంకు చెందిన గొరుముచ్చు శ్రీనివాసరావు ఆగ్రహానికి గురై పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని స్థానిక రైతులు, పోలీసులు అడ్డుకున్నారు. సీఐ మూర్తి, రైతుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. తొలుత కోర్టు సెంటరు నుండి వంతెన సెంటరు వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా నాయకుడు గుడివాక శివరావు, బీసాబత్తిన ప్రసాద్, సింహాద్రి రమేష్‌బాబు, సీపీఎం నాయకులు శీలం నారాయణరావు, సీపీఐ నేత అడ్డాడ ప్రసాద్, సురేంద్రనాధ్ బెనర్జి, బీజెపీ నాయకులు గుడివాక అంజిబాబు, జివి నగరాయులు, జనసేన నేత రాయపూడి వేణుగోపాలరావు, భోగాది చంద్రశేఖర్, అన్నపరెడ్డి వెంకట స్వామి రైతులకు సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా మొక్కజొన్న పంటను రక్షించేందుకు ఇప్పటికే బోర్లు పని చేస్తున్నాయని, పంటను రక్షించి తీరుతామని, భయపడాల్సిన పని లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే, ఉపసభాపతి బుద్ధప్రసాద్‌కు సమాచారం పంపారు. రైతుల ఆందోళన తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు. జాయింట్ కలెక్టర్ - 2 పిడుగు బాబూరావు, నీటి పారుదల శాఖ ఎస్‌ఇ రమేష్ బాబు, వ్యవసాయ శాస్తవ్రేత్తలు అచ్యుతరావు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రాజప్రదీప్ కుమార్ సాయంత్రం తాలుకా కార్యాలయానికి వచ్చి రైతు ప్రతినిథులతో చర్చలు జరిపారు. జెసీ-2 బాబూరావు మాట్లాడుతూ రూ.30 కోట్లతో 150 క్యూసెక్కుల సాగునీరు సరఫరా చేయటం జరుగుతుందని, మరో 10 బోర్లు ఏర్పాటు చేయటం ద్వారా మొక్కజొన్న పంట రక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి రెండు కిలోమీటర్లకు పోలీసులు రెవెన్యూ, రైతులతో ఒక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. పులి చింతలలో నీరు లేదని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి నీరు రాదని, ఒక టీఎంసీ నీరు విడుదల చేస్తే 10వేల ఎకరాలకు సద్వినియోగం చేయాల్సి ఉంటుందని, లేకపోతే వృధా అవుతుందని జెసీ-2 పేర్కొన్నారు. కావున సాగునీరు వదలటం సాధ్యపడదని, బోర్లు ద్వారా నీరు అందించి మొక్కజొన్న పంటను రక్షిస్తామని స్పష్టం చేశారు. కాగా రైతులు కాలువ ద్వారా సాగునీరు వదలాల్సిందేనని, లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని బీజెపీ నేత భోగాది చంద్రశేఖర్ హెచ్చరించారు. అనంతరం అధికారుల బృందం మొక్కజొన్న పంటను పరిశీలించగా శాస్తవ్రేత్తలు మరో వారం రోజులు వరకు పంటకు ఏ విధమైన నష్టం వాటిల్లదని, రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయినా రైతాంగం తృప్తి చెందక ఆందోళన చేయటానికే మొగ్గు చూపారు.