కృష్ణ

ఎన్టీఆర్ ఇళ్లకు మోక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 25: జిల్లాలో ఎన్టీఆర్ ఇళ్లకు మోక్షం లభించనుంది. వివిధ కారణాల వల్ల గత మూడేళ్లుగా నిర్మాణాలకు నోచుకోని ఎన్టీఆర్ గృహాలకు పునాది రాళ్లు పడనున్నాయి. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు జిల్లా యంత్రాంగం ఈ నెల 26 నుండి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు నేటి నుండి మార్చి 12వ తేదీ వరకు పది రోజుల పాటు ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. గడిచిన మూడేళ్లల్లో జిల్లాకు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గృహాలు మంజూరయ్యాయి. గృహాలు మంజూరైనా చాలా మంది వివిధ కారణాలతో నిర్మాణాలు ప్రారంభించని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 30వేల గృహాలు నిర్మాణాలకు నోచుకోవల్సి ఉంది. ఈ 15 రోజుల్లో 30వేల గృహాల నిర్మాణాలను ప్రారంభించాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఈ పక్షం రోజుల పాటు ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణాన్ని కల్పించి శంకుస్థాపన మహోత్సవాలు చేయనున్నారు. 2016-17 సంవత్సరంలో జిల్లాకు 16వేల 990 గృహాలు మంజూరయ్యాయి. 2017-18లో మరో 12వేల 217 గృహాలను మంజూరు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19కి సంబంధించి 12వేల 223 గృహాలు మంజూరయ్యాయి. ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద 2016 నుండి నేటి వరకు 13వేల గృహాలు మంజూరయ్యాయి. పట్టణ ప్రాంతాల విషయానికోస్తే బీఎల్‌సీ పథకం కింద రెండేళ్లల్లో 6వేల 567 గృహాలు జిల్లాకు మంజూరయ్యాయి. గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. పొజిషన్ సర్ట్ఫికేట్స్ లేని కారణంగా నిర్మాణాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇటీవలి కాలంలో పొజిషన్ సర్ట్ఫికేట్స్ జారీని జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల ప్రారంభంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం శంకుస్థాపనలకు రోజులు అనుకూలంగా ఉండటంతో ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. పక్షం రోజుల పాటు ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.

ఐక్య పోరాటంతో డిమాండ్ల సాధన

*ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభలో వక్తలు

జి.కొండూరు, ఫిబ్రవరి 25: ఐకమత్యంతో పోరాడి డిమాండ్లు సాధిద్దామని వక్తలు ఉద్ఘాటించారు. మండల పరిధిలోని కట్టుబడిపాలెంలో ఆదివారం జరిగిన మైలవరం నియోజకవర్గ స్థాయి ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచే వరకూ పోరాడుదామన్నారు. సభకు భారీగా ముదిరాజ్‌లు తరలిరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీసీ గ్రూపు-డి నుంచి ఎ-జాబితాలోకి మార్చాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.ఎన్.మారేష్ మాట్లాడుతూ ముదిరాజ్‌లకు నామినెటేడ్ పోస్టుల నియామకంలో వివక్ష జరుగుతోందన్నారు. వెయ్యికోట్ల మూలనిధితో ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై నేరుగా రుణాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది ముదిరాజ్‌లు ఉన్నా రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. మైలవరం నియోజకవర్గంలో 25వేల మంది ముదిరాజ్ ఓటర్లు ఉన్నారన్నారు.
రాష్ట్రంలో గెలుపును శాసించే స్థాయిలో ముదిరాజ్ ఓటర్లు ఉన్నారన్నారు. ముదిరాజ్‌లకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ముదిరాజ్‌లకు కనీస అవసరాలు కూడా లేక కడు పేదరికంలో గడుపుతున్నారన్నారు. పాలకులు స్పందించకపోతే భవిష్యత్తులో అధికార పార్టీలకు భారీ మూల్యం తప్పదన్నారు. ముదిరాజ్‌ల ప్రదర్శనతో కట్టుబడిపాలెం జనసంద్రమైంది. ముదిరాజ్ సంఘం నాయకులు బసవబోయిన నాగేశ్వరరావు, చెన్నూరు సుబ్బారావు, బుస్సు కోటేశ్వరరావు, కేదాసు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.