కృష్ణ

వైభవంగా చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఏప్రిల్ 29: మండలంలోని దాములూరు కూడలి సంగమేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో పుష్కర నిధులతో నిర్మించిన చెన్నకేశవస్వామి వారి ఆలయ ప్రతిష్ఠలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు అంగర సీతారామాచార్యులు, లక్ష్మణాచార్యులు, శ్రీనివాసశర్మ, సుధీర్ శర్మ, భార్గవ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేన పూజల అనంతరం 11.44 గంటలకు యంత్ర ప్రతిష్ఠ, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి విగ్రహ, ద్వారపాలక, గరుడ, హనుమత్ జీవ ధ్వజ దండ శిఖర ప్రతిష్ఠలు వైఖానస సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కొణతమాత్మకూరు సొసైటి అధ్యక్షుడు గాదెల వెంకట రామారావు భక్తులకు పదివేల లీటర్ల మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతిష్ఠా ఉత్సవాలను ఆలయ ఇఒ గడిపూడి కోటేశ్వరరావు, సంగమేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వెంకట నర్సయ్య, పలు గ్రామాల నాయకులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. కాగా సందట్లో సడే మియా అన్న చందంగా జేబు దొంగలు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి పలువురు మహిళల మెడల్లోని బంగారు నాంతాడులను తస్కరించారు. నలుగురు మహిళల వద్ద నుండి సుమారు 4లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురికావడంతో పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుల నుండి సమాచారం సేకరించారు.