కృష్ణ

జక్కంపూడి రైతుల ఔదార్యం మరువలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 12: భారతదేశంలోనే తొలిసారిగా నిర్మించనున్న ఎకనమిక్ సిటీ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన జక్కంపూడి గ్రామ రైతుల ఔదార్యం మరువలేనిదని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. భూములు ఇచ్చేందుకు గాను సోమవారం విజయవాడ రూరల్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో కలెక్టర్ లక్ష్మీకాంతం మచిలీపట్నంలోని కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎంతో సహృదయంతో భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు అభినందనలు తెలియచేశారు. 250 ఎకరాల్లో దేశంలో ఎక్కడా లేనటువంటి ఎకనమిక్ సిటీని జక్కంపూడిలో నిర్మించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అభివృద్ధి
* ఇప్పటికీ ఇవ్వని పుష్కర పనుల డబ్బులు* ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి
తోట్లవల్లూరు, మార్చి 12: అభివృద్ధి గురించి గొప్ప చెప్పటం కాదని, ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు చూపించాలని ఎంపీపీ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి టీడీపీ నాయకులను ప్రశ్నించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశంలో వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి చేస్తున్నారని గురుమూర్తి చెప్పటం హస్యస్పదంగా ఉందని అన్నారు. అభివృద్ధి గురించి మాటల్లో చెప్పటం తప్ప చేతల్లో లేదని, ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రక్టర్లు లబోదిబో మంటు ఆత్మహత్యలకు సిద్దమయేటట్లు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ గృహాలు నిర్మించుకున్న వారికి ఉపాధి నిధులు రాక లబ్ధిదారులు ఎన్నో క ష్టాలు పడుతున్నారని, మండలంలో 14 స్మశాన వాటికలు ఉపాధి పథకం కింద మంజూరైతే ఒక్కచోట కూడా పని మొదలు పెట్టలేదని, పుష్కరాలకు చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారని అ న్నారు. ఎమ్మెల్యే కల్పన చేసిన అభివృ ద్ధి పనులు ఎక్కడ చేశారో చూపాలని అన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి మాట్లాడుతూ టీడీపీలో ఉప్పులేటి కల్పనను పట్టించుకోకపోతే వైఎస్ జగన్ పార్టీలో చేర్చుకుని ఎమ్మెలేగా గెలిపిస్తే విశ్వాసం లేకుండా మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారని విమర్శించా రు. కల్పన, టీడీపీ నాయకులు చేసిన అభివృద్ధి మట్టి, ఇసుక అమ్ముకోవటమేనని ఎద్దేవ చేశారు. సమావేశంలో మండల వైసీపీ కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పిఎస్ కోటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు.