కృష్ణ

చంద్రన్న మాల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 12: పేద మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో తీసుకువచ్చేందుకు గాను ఏర్పాటు చేసిన చంద్రన్న మాల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కోరారు. స్థానిక 9వ వార్డులో ఏర్పాటు చేసిన చంద్రన్న విలేజ్ మాల్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల స్థానంలో చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ మాల్స్ ద్వారా నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయన్నారు. 20 నుండి 30 శాతం వరకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పొందవచ్చన్నారు. సూపర్ మార్కెట్లలో దొరికే అన్ని రకాల వస్తువులు ఈ మాల్స్‌లో లభ్యమవుతాయన్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా నిత్యావసర వస్తువులను ఈ మాల్స్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో ధరలకు 30 శాతం వ్యత్యాసంతో తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను చంద్రన్న మాల్స్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ కొట్టె వెంకట్రావ్, తహశీల్దార్ బి నారదముని పాల్గొన్నారు.

రాజ్యసభ అభ్యర్థి రవీంద్రను అభినందించిన ఉపసభాపతి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, మార్చి 12: తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు పోటీ చేసేందుకు ఎంపికైన కనకమేడల రవీంద్రను సోమవారం విజయవాడలో ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను దుశ్శాలువాలతో సత్కరించారు. అవనిగడ్డ మండలం జయపురం గ్రామానికి చెందిన రవీంద్ర రాజ్యసభకు ఎంపిక కావడం శుభ పరిణామం అన్నారు. దివిసీమ అభివృద్ధికి రవీంద్ర కృషి చేస్తారన్న ఆశాభావాన్ని బుద్ధప్రసాద్ వ్యక్తం చేశారు.