కృష్ణ

ప్రజాదివస్ అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 12: ప్రజాదివస్‌లో వచ్చే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ సబ్ డివిజన్‌ల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అర్జీలను సత్వరమే పరిష్కరించాలని స్టేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ శేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ మహ్మద్ బాషా, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు తిలక్, హరిరాజేంద్ర బాబు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రామారావు, ఎఆర్ డీఎస్పీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.