కృష్ణ

‘మేముసైతం’తో రక్తహీనతను అధిగమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 12: జిల్లాలో నెలకొన్న రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. గర్భిణీలు, బాలింతలు, శివువులకు పౌష్ఠికాహారం అందించేందుకు గాను రూపకల్పన చేసిన ‘మేము సైతం’ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కేం ద్రం మచిలీపట్నంలో ఆయన లాంచనంగా ప్రారంభించారు. గొడుగుపేట శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మేముసైతం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా కృష్ణాజిల్లాలో అనీమియా, హిమోగ్లోబిన్ లోప నివారణకు గాను ‘మేము సైతం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఏ దేశంలోనైనా మానవ వనరుల అభివృద్ధి సూచికలు వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాశం, సమాజ వికాసం అభివృద్ధి చెందితేనే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారన్నారు. ఆ దిశగానే జిల్లాలో అడుగులు వేస్తూ మాతా శిశు మ రణాలను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గర్భిణీ మహిళలు ఆస్పత్రి ప్రసవాల పెంపు, పౌష్ఠికాహార లోపం నివారణ, అనీమియా నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మేముసైతం కార్యక్రమంలో ద్వా రా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు సజ్జ లడ్డూలు, నువ్వుల లడ్డూలను ఆరు నెలల పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 46వేల మంది గర్భిణీలు, బాలింతలను నమోదు చేశామన్నారు. వీరందరికీ ప్రతి రోజూ సజ్జలడ్డు, నువ్వుల లడ్డు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారిస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, సీడీపీఓ జయలక్ష్మి, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, తహశీల్దార్ నారదముని, కౌన్సిలర్లు తమ్మన హేమ కుసుమ, కాసాని రంగమ్మ, డా. రఘునాధ్, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు.