కృష్ణ

ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఇ - కలెక్టర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఇ-కలెక్టర్’ వెబ్‌సైట్‌ను రూపొందించి త్వరలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ ఇ-కలెక్టర్ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ - కలెక్టర్ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని వినూత్న తరహాలో నూతనంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం వలన ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి కలెక్టర్ దృష్టికి వస్తుందని దానిని వెంటనే సంబంధిత అధికారి ద్వారా సమస్యను వేగంగా పరిష్కరింపబడుతుందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా మన జిల్లాలోనే అమలు చేస్తున్నామని తెలిపారు.
బయోమెట్రిక్ హాజరులో కృష్ణా ఫస్ట్
ఆధార్ అధారిత బయోమెట్రిక్ హాజరులో జిల్లా 71 శాతం సాధించి రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల నూరు శాతం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలోని 6,927 ప్రభుత్వ కార్యాలయాలకుగాను ఇప్పటి వరకు 4,942 కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేసి 71 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. ఈ నెలాఖరులోగా నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.
రేపు డయిల్ యువర్ కలెక్టర్
మంచినీటి సమస్యపై బుధవారం ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో తెలపారు. జిల్లాలోని ప్రజలు మంచినీటి సమస్యలపై 0866 2481555 నెంబర్‌కు ఫోన్ చేసి తమ ప్రాంతాల్లోని మంచినీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు.