కృష్ణ

రాచరిక పాలన సాగిస్తున్న ‘మోదీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని నరేంద్రమోదీ రాచరిక పాలన సాగిస్తున్నారని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో బీజేపీని నమ్మిన పాపానికి నేడు కేంద్రం చేతిలో రాష్ట్ర ప్రజలు మోసపోయారన్నారు. నేను ఏం చెప్పినా నెగ్గుతుందనే భావనలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో రాచరిక పాలనను మోదీ సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఆర్థిక నేరస్తులకు ప్రధాని కార్యాలయం ఆశ్రయమిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలుగు జాతి ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై పోరాటానికి సిద్ధపడ్డారన్నారు. నాలుగేళ్ల రాష్ట్ర ప్రజల సహనాన్ని చూసిన మోదీ రానున్న రోజుల్లో ఐదు కోట్ల ఆంధ్రుల ఆగ్రహాన్ని చవి చూడబోతున్నారన్నారు. రాష్ట్రంలో ఎందుకూ పనికి రాకుండా ఉన్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో కేంద్రం లాలూచీ పడటం సిగ్గు చేటన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మోదీ వలలో చిక్కుకున్నాడన్నారు. నిన్నటి వరకు సమర్ధుడంటూ చంద్రబాబు పాలనను ప్రశంసించిన పవన్ కల్యాణ్ ఒక్క రాత్రిలో చంద్రబాబు అంత అవినీతిపరుడు లేడంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదన్నారు. పవన్ తన వ్యాఖ్యలతో ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను కూడా పోగొట్టుకున్నారన్నారు. అవగాహనా రాహిత్యంతో పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలను పట్టించుకోవల్సిన అవసరం తమకు లేదన్నారు. కేంద్రంతో తెగతెంపులు చేసుకున్న ప్రభావం పోలవరం ప్రాజెక్టుపై పడకూడదన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9వేల కోట్లు నిధులు కేటాయించారన్నారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పబలంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఒక పక్కన సమర్ధవంతమైన పాలన సాగిస్తూనే కేంద్రంపై అవిశ్రాంత పోరాటానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు మాట్లాడుతూ గత కొనే్నళ్లుగా దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వాలు విస్మరిస్తూ వస్తున్నాయన్నారు. ఎన్డీఎ ప్రభుత్వం సైతం ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పివి ఫణికుమార్ పాల్గొన్నారు.

లక్ష్య సాధనలో ‘కృష్ణా’దే అగ్రస్థానం
* చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ప్రథమ స్థానం
* మల్బరీ సాగులోనూ గణనీయమైన పురోగతి
* ఉద్యానరంగంలో 26.56 జీవీఎతో ముందంజ
* వారంలో రూ.1500కోట్లు లింకేజీ రుణాలు
* ఇరిగేషన్, పీఆర్, హౌసింగ్ పనితీరుపై అసంతృప్తి
* సమీక్షా సమావేశంలో కలెక్టర్ లక్ష్మీకాంతం

మచిలీపట్నం, మార్చి 19: రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా లక్ష్య సాధనలో ప్రథమంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నందు వల్లే పాలనా పరంగా జిల్లాకు రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి పేరు వస్తోదన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సోమవారం కలెక్టర్ బంగ్లాలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పేర్కొన్నారు. మహాత్మ గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో రోజుకు లక్ష మందికి పని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలన్నారు. పనులు ప్రారంభించని గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయాలన్నారు. గ్రామీణ గృహ నిర్మాణానికి సంబంధించి 2017-18, 2018-19 సంవత్సరాలకు మంజూరు వెంటనే జరగాలన్నారు. మంజూరైన గృహాలన్నీ గ్రౌండింగ్ చేయాలన్నారు. గ్రామీణ గృహ నిర్మాణం, గ్రామీణ్, బీఎల్‌సీ పారామీటర్లలో అనుకున్న స్థాయిలో ప్రగతి సాధించకపోవటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1వతేదీ నుండి పాఠశాలల నర్సరీలు ప్రారంభం కావాలని అటవీ శాఖాధికారులను ఆదేశించారు. చేపల, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మత్స్య 10.70లక్షల మెట్రిక్ టన్ను లక్ష్యానికి గాను 11.09లక్షల మెట్రిక్ టన్నులు 106 శాతం సాధించినట్లు తెలిపారు. చేప పిల్లల ఉత్పత్తిలోనూ జిల్లానే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఉద్యాన రంగంలో ఇప్పటి వరకు 26.56 జీవీఎ సాధించామన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమన్నారు. పట్టు పరిశ్రమ ప్రగతికి సంబంధించి 200 ఎకరాల్లో మల్బరీ తోటల సాగు లక్ష్యానికి 550 ఎకరాల్లో సాగు చేసి లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు. పట్టు పరిశ్రమ రంగంలో గత ఏడాది 2.17జీవీఎ సాధించగా ఈ ఏడాది 5.07 జీవీఎ సాధించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖకు సంబంధించి పంట రుణాల మంజూరులో 4301 కోట్ల రూపాయలు మంజూరు చేసి 121 శాతం లక్ష్యం సాధించామన్నారు. ఇది రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్థానమన్నారు. కౌలు రైతులకు 530 కోట్లకు గాను 516.34కోట్లు పంట రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. చంద్రన్న రైతు క్షేత్రాల 4వేల ఎకరాల లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. భూగర్బ జలాలు, రీచార్జింగ్ బాగా జరగాలన్నారు. మంజూరైన బోర్‌వెల్స్‌ను మూడు రోజుల్లో డ్రిల్లింగ్ చేయాలన్నారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారుల పనితీరు పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్ యాక్ట్ కింద రికవరీ వేగంగా జరగాలని పంచాయతీ రాజ్ అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు జిల్లాలో బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరు రూ.1500కోట్లు లక్ష్యాన్ని వారం రోజుల్లో అధిగమించాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ వెంకటేష్, డీఎఫ్‌ఓ బెనర్జి, వ్యవసాయ శాఖ జెడీ మోహనరావు, మత్స్య శాఖ జెడీ యాకుబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.