కృష్ణ

‘నాసా’కు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: అమెరికా అంతరిక్ష సంస్ధ (నాసా) పరిశోధనకు నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉంటున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు డైరెక్టర్ ఎస్ హరశ్రీరాములు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మే నెల 24వ తేదీ నుండి 27 వ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో నాసా నిర్వహిస్తున్న స్పేస్ సెటిల్‌మెంట్ కాంపిటీషన్‌కు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన వీరు రూపొందించిన సర్వాయుష్ ప్రాజెక్టు ఎంపికైందని వివరించారు. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎ జ్యోత్న వెంకటలక్ష్మీ, ఎస్ లక్ష్మీప్రియ, జి నాగఅశ్విని, బి జీవన సంధ్యారాణి సర్వాయుష్‌ను రూపొందించి, ఫిబ్రవరి 4న ప్రధమ పరిశీలనకు పంపగా, కాంపిటీషన్‌కు ఎంపికైనట్లు నాసా నుండి సమాచారం వచ్చినట్లు డైరెక్టర్ హర శ్రీరాములు తెలిపారు.

నగదు రహిత లావాదేవీలతో పారదర్శకత

మైలవరం, మార్చి 23: దేశంలో నల్లధనాన్ని పారద్రోలేందుకు, పారదర్శక పాలనకు నగదు రహిత లావాదేవీలే శరణ్యమని సీబీఐ మేనేజరు ఎన్.శ్రీనివాస్ పేర్కొన్నారు. మైలవరంలోని ఎల్బీఆర్సీఇలో నగదు రహిత లావాదేవీల వల్ల ప్రయోజనాల గురించి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పన్నుల ఎగవేతకు నగదుతో కూడిన లావాదేవీలు జరుపుతున్నారన్నారు. ప్రజలను నగదు రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఎటిఎంలు తీసేసే అవకాశం ఉందన్నారు. మనీ ట్రాన్స్‌ఫర్ మొబైల్ అప్లికేషన్ల గురించి వివరించారు. ప్రిన్సిపాల్ కె.అప్పారావు, సీబీఐ మేనేజర్లు ప్రియేష్ గౌతమ్, గాయత్రి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, పి.అశోక్‌రెడ్డి, డా.సుజిత్‌కుమార్‌రాత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.