కృష్ణ

జిల్లాలో క్షయను రూపుమాపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: జిల్లాలో క్షయ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికబద్ధంగా పనిచేసి పూర్తిగా వ్యాధిని రూపుమాపాలని జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని శనివారం జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ టీబీ వ్యాధికి సంబంధించి పూర్తి చికిత్సా విధానం అమలులో ఉందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో టీబీ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి పద్మజారాణి, ఉప వైద్యాధికారి శాస్ర్తీ, తదితరులు పాల్గొన్నారు.