కృష్ణ

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 24: ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసం తీర్మానానికి అన్ని పక్షాల మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ బందరు నియోజకవర్గ అధ్యక్షుడు రామిశెట్టి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ కోరారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆది నుండి పోరాడుతోందన్నారు. ఇప్పటికే అనేక ఉద్యమాలను కాంగ్రెస్ పార్టీ చేపట్టిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దాదా సాహెబ్, పేరిశెట్టి నాగరాజు, నల్లమోతు కుమారి తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి చెరువులు నింపాలి

కృత్తివెన్ను, మార్చి 24: రెండు, మూడు రోజుల్లో ప్రధాన పంట కాలువకు మంచినీరు వస్తుందని యుద్ధప్రాతిపదికన గ్రామాలలోని మంచినీటి చెరువులను నింపాలని ఎంపీపీ వలవల సత్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంచినీటి చెరువులను నింపే విషయమై ఎంపీపీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీటీసీ ఒడుగు తులసీరావు మాట్లాడుతూ 930 టీఎంసీల సామర్ధ్యం కలిగిన పంట కాలువకు 300 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, ప్రణాళికా బద్ధంగా 16 పంచాయతీలలో మంచినీటి చెరువులను నింపాలన్నారు. సమావేశంలో కొంత మంది సర్పంచులు 300 టీఎంసీల నీరు ఏ మాత్రం సరిపోదన్నారు. మంచినీరు సక్రమంగా అందించేందుకు టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ రత్నగిరిరావు తెలిపారు. చేపల చెరువులకు మంచినీరు తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఇన్‌ఛార్జి ఎఇ నాగబాబు, ఇరిగేషన్ ఎఇ సిద్దార్ధ, ఎస్‌ఇ తులసీరామకృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.