కృష్ణ

‘ప్రజాదివస్’ అర్జీలపై తక్షణం స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 24: ప్రజాదివస్‌లో వచ్చే సమస్యలపై తక్షణమే స్పందించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీకి తెలియచేశారు. దీనిపై స్పందించిన ఆయన సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇరిగేషన్ మంత్రి ఇలాకాలో సాగునీటి కష్టాలా?

* వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శ

మైలవరం, మార్చి 24: రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో రైతులు తాగు, సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. మండలంలోని చండ్రగూడెం సమీపంలో సాగునీరు లేక ఎండిపోయిన వరి, మిర్చి పంటలను ఆయన శనివారం సందర్శించారు. వరి పంట ఎండిపోయి పశువులను మేపుతున్న వైనాన్ని ఆయన స్వయంగా చూశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఈవిధంగా ఉంటే రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. నవంబరు 15 నుండి నాగార్జున సాగరు ఎడమకాలువ పరిధిలోని మూడో జోన్‌లో ఉన్న మైలవరం ప్రాంతానికి సాగు నీరు రావాల్సి ఉండగా ఇంత వరకూ రాని కారణంగా ఆరుతడి పంటలు ఎండిపోతున్నారని రైతులు గగ్గోలు పెడుతుంటే మంత్రికి పట్టటం లేదన్నారు. నోటికాడికొచ్చిన పంట ఎండిపోతుందన్నారు. మామిడి, మిర్చి, పసుపు, వరి, వేరుశెనగ పంటలు వందలాది ఎకరాలలో ఉన్నాయని మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. మరోవైపు వేసవి కాలం ముంచుకొస్తుంటే తాగునీటి కష్టాలు ఇప్పటికే ఆరంభమయ్యాయని, గ్రామాలలో చెరువులు ఎండిపోయి బావులు, బోర్లు వట్టి పోతున్నాయని పర్యవసానంగా తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మంత్రి ఇప్పటికే సాగునీటిని విడుదల చేయించి గ్రామాల్లో చెరువులు నింపినట్లైతే ఈదుస్థితి ఏర్పడేది కాదని ఆయన అన్నారు. రాజధానికి దగ్గర్లో ఉండికూడా ఈప్రాంతానికి ఈపరిస్థితి రావటం సిగ్గు చేటన్నారు. వెంటనే మంత్రి ఉమ స్పందించి వంతుల వారీగా ఈప్రాంతానికి రావాల్సిన సాగర్ నీటిని రప్పించి ఆరుతడి పంటలు కాపాడాలని, అదేవిధంగా తాగునీటి ఎద్దడిని నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపిపి జొన్నలగడ్డ గంగాధరరావు, పార్టీ నేతలు పామర్తి శ్రీనివాసరావు, కరీమ్, ప్రతాప్‌రెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.