కృష్ణ

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 24: కేంద్ర సహకారం లేకున్నా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ విజ్ఞప్తి చేశారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ అనూరాధ అధ్యక్షతన స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా అనూరాధ మాట్లాడుతూ తెలంగాణ నుండి విభజించబడిన రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకున్నా అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం అయ్యేలా కృషి చేయాలన్నారు. ధనికులతో సమానంగా పేదలను కూడా జన జీవన స్రవంతిలోకి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా పరిషత్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంత పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్య, వైద్యం, మంచినీరు తదితర వౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. కిశోర బాలికలు, మహిళల ఆరోగ్య సంరక్షణకు ఆహారజ్యోతి, ఆరోగ్యదీప్తి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ పరిషత్ కూడా ఆదాయ వనరులు సరిగ్గా లేకున్నా రహదారులు, మంచినీటి సరఫరా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం లేదన్నారు. వృత్తి నైపుణ్యంలో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల నిర్మాణానికి పూనుకున్నామన్నారు. 16 భవనాలకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వగా ఎనిమిది భవనాల నిర్మాణాలు పూర్తయినట్లు వివరించారు. ఎ.కొండూరు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న కిడ్నీ వ్యాధి నివారణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నూజివీడు కేంద్రంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డయాలసిస్ చేసుకునే బాధితులకు పెన్షన్ కూడా ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి జన్మభూమిలో మంజూరైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గతంలో విధించిన నిబంధనల కారణంగా ఆగిపోయిన వారికి కూడా పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కొంత మంది దివ్యాంగులకు వేలిముద్రలు పడక ఆధార్ కార్డు కూడా పొందలేకపోయారని, అటువంటి వారికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకపోయిందని పలువురు సభ్యులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన ఆమె అటువంటి కేసులను ప్రత్యేకంగా తీసుకుని కలెక్టర్ అనుమతితో పెన్షన్‌ల మంజూరుకు కృషి చేయాలని డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖర్‌రాజుకు సూచించారు. దీనిపై స్థారుూ సంఘ సమావేశంలో కూడా సభ్యులు తీర్మానం చేశారు. పీడీ చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ బీసీల ద్వారా పెన్షన్‌లు ఇవ్వడం వల్ల చనిపోయిన వారి పేర్లు నమోదు కాకపోవటంతో జిల్లాలో 4వేల 200 మంది ఇప్పటి వరకు పెన్షన్ పొందారన్నారు. ఫిబ్రవరి నెల నుండి ప్రభుత్వం పెన్షన్లను నేరుగా పంచాయతీ కార్యదర్శులచే ఇస్తుండటంతో ఇటువంటి కేసులు బయట పడ్డాయన్నారు. అటువంటి కేసులను పూర్తిగా తొలగించినట్లు తెలిపారు. ఆరోగ్య దీప్తి కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులకు ముందస్తు సమాచరం ఇవ్వాలని చైర్‌పర్సన్ ఆదేశించారు. ఈ సమావేశంలో డెప్యూటీ సీఇఓ కృష్ణమోహన్, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో చరిత్ర సృష్టిస్తాం

వెల్వడం సభలో మంత్రి ఉమ స్పష్టీకరణ

మైలవరం, మార్చి 24: పేదలకోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పధకాల అమలులో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఈవిషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మండలంలోని వెల్వడంలో శనివారం ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఐదు వేల 500 పట్టాలను పంపిణీ చేయటం జరిగిందని, మరో రెండు వేల పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మైలవరం నియోజకవర్గంలో దీనిని స్పూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30వేల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 40వేల పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ళ స్థలాల పంపిణీలో రికార్డు సృష్టించబోతున్నట్లు మంత్రి ఉమ ప్రకటించారు. పట్టాల పంపిణీలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హతే ప్రామాణికమన్నారు.

సాగర్ జలాలు వస్తున్నాయ్
ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుత గడ్డు పరిస్థితులలో సైతం నాగార్జున సాగరు ఎడమ కాలువ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినట్లు మంత్రి ఉమ ప్రకటించారు. ఇప్పటికే ఈనీరు మైలవరం నియోజకవర్గంలోకి చేరుకున్నాయని ఈనీటిని చెరువులకు నింపుకుని తాగునీటి, సాగునీటి వెతలు తగ్గించుకోవాలన్నారు. అభివృద్ధిలో తాము నిరంతరం శ్రమిస్తుంటే కొందరు వైసీపీ దొంగలు గ్రామాలలోకి వచ్చి తనను, చంద్రబాబును తిడుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విపక్షాల కుట్రలను కార్యకర్తలు, నేతలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంతో విపక్షాల నోళ్ళు మూయిస్తామన్నారు. వచ్చే జూన్ నాటికి పోలవరం ద్వారా నీటిని విడుదల చేయిస్తామన్నారు. తాము ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే కుప్పం కన్నా ముందుగా పులివెందులకు నీరిచ్చామని ఆయన గుర్తు చేశారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే తమపై అభండాలు వేస్తూ తమను జైలుకు పంపిస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈసందర్భంగా 130 మంది పేదలకు మంత్రి ఉమ ఇళ్ళ స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈసమావేశంలో పార్టీ నేతలు కోమటి సుధాకర్, తాతా పోతురాజు, శోభన్‌బాబు, సర్పంచ్ వసుంధర, తహశీల్దార్ కెవి శివయ్య తదితరులు పాల్గొన్నారు.