కృష్ణ

అధికారుల తీరుపై చైర్‌పర్సన్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఏప్రిల్ 30: అధికారుల తీరుపై నగర పంచాయతీ చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం 2.30 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మెజార్టీ సభ్యులు వచ్చినప్పటికీ ఇన్‌చార్జి కమిషనర్, ఎఇ రామకృష్ణ సమయానికి రాకపోవడంతో అరగంట ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. ఎజెండాలోని అంశాలను ఆర్‌ఐ రమణ చదువుతుండగా వేసవి తాపం అధికంగా ఉండటంతో సభ్యులకు తక్షణం మంచినీరు అందించాలని చైర్‌పర్సన్ సిబ్బందికి సూచించారు. 25 నిమిషాలు దాటినా మంచినీరు అందించకపోవడంతో ఒక్కసారిగా చైర్‌పర్సన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘కౌన్సిల్ అంటే అధికారులకు లెక్కలేకుండా ఉంది.. మంచినీళ్ల బాటిళ్లు అందించేవరకూ సభను నిలుపుదల చేస్తున్నాం’ అని చైర్‌పర్సన్ ప్రకటించి సీటు నుండి లేచి పక్కసీటులో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో సమావేశాన్ని వాయిదా వేద్దామని కూడా అన్నారు. అధికారుల్లో పైశాచిక ప్రవృత్తి ఎక్కువయ్యిందంటూ ‘ఎవరి కంట్రోల్‌లో ఎవరు పనిచేస్తున్నారు? సమావేశ నిర్వహణ బాధ్యత ఎవరిది?’ అంటూ ఆమె నిలదీశారు. తరువాత మంచినీళ్ల బాటిళ్లు అందజేయడంతో సమావేశాన్ని కొనసాగించారు.
ఎజెండాలోని అంశాలను చదువుతుండగా వార్డుల్లో చేపట్టే పనులపై తనకు తెలియజేయాల్సిన అవసరం లేదా? అంటూ ఎఇని ప్రశ్నించారు. దీంతో ఎఇ లేచి ఇకపై కౌన్సిలర్లు ఇచ్చే అర్జీలపై చైర్‌పర్సన్ సంతకం చేసి తీసుకురావాలని సూచిస్తానని అన్నారు. దానికి ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన సంతకం అవసరం లేదని, తనకు తెలియజేస్తే చాలన్నారు. ఎజెండాలోని 20 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. కాంట్రాక్ట్ సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి మ్యాన్‌పవర్ సర్వీసింగ్ ఏజెన్సీస్ (జుజ్జూరు) వారికి రూ.10లక్షల 81వేల 329 చెల్లింపు విషయంపై డెప్యూటీ ఫ్లోర్ లీడర్ కత్రోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్ కార్మికులకు కొబ్బరినూనె, సబ్బులు, గ్లౌజ్‌లు అందజేయాల్సి వుండగా వాటిగురించి అడగకుండా చెల్లింపులు ఏలా చేస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చెల్లిస్తున్నామని, వెంటనే ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్‌కు టెండర్ పిలవాలని అధికారులను చైర్‌పర్సన్ ఆదేశించారు. సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.