కృష్ణ

తీవ్రతరమవుతున్న ‘హోదా’ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రత్యేక హోదా ఉద్యమం జిల్లాలో రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రతి రోజూ జిల్లా అంతటా నిరసనలు పెల్లుబుగుతున్నాయి. ఇప్పటికే ఉద్యమాన్ని హోరెత్తించిన రాజకీయ పక్షాలు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర బంద్ చేపట్టనున్నారు. రాష్ట్ర బంద్‌ను జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ఆది నుండి హోదాపై పోరాడుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రస్తుతం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర సాగిస్తున్నారు. దీంతో ఉద్యమం మరింత ఊపందుకోనుంది. రాష్ట్ర బంద్‌కు జగన్మోహనరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో సోమవారం జిల్లాలో చేపట్టాల్సిన పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. పార్టీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనేందుకు గాను పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ ఒక ప్రకటనలో తెలియచేశారు. దీంతో వైసీపీ శ్రేణులంతా పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదా సాధన సమితితో ఆది నుండి కలిసి నడుస్తున్న జనసేన, వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బంద్‌లో పాల్గొనున్నారు. బంద్‌కు సంఘీభావంగా న్యాయవాదులు జిల్లా అంతటా విధుల బహిష్కరణకు ముందుకు వచ్చారు. ఆయా న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసనలు తెలియచేయనున్నారు. వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు బంద్ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ విద్యా సంస్థలు సాధన సమితిని కోరింది. దీంతో విద్యా సంస్థల బంద్ ఏ మేర ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం బంద్‌ను దృష్టిలో పెట్టుకుని నేడు జరగాల్సిన పరీక్షను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. దీని బట్టి చూస్తే విద్యా సంస్థలు కూడా బంద్ చేసే అవకాశం కనిపిస్తోంది. విద్యా శాఖ మాత్రం ఎటువంటి ముందస్తు సెలవు ప్రకటించకపోవడం విశేషం.

పోటాపోటీగా టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు

మైలవరం, ఏప్రిల్ 15: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో మైలవరం నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వంలో కీలకమైన శాఖలో కొనసాగుతున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండటంతో రాజకీయానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తొలి దశలో జగన్ పాదయాత్ర మైలవరం నియోజకవర్గంలో లేదు. తర్వాత కొన్ని పరిణామాల నేపధ్యంలో పాదయాత్ర రూటు మార్చి మైలవరం నియోజకవర్గాన్ని కలిపారు. దీంతో జగన్ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. జగన్ పర్యటన మైలవరం నియోజకవర్గంలో వెళ్ళే గ్రామాలు, రహదారులన్నీ వైసీపీ కన్నా ముందుగానే తమ పార్టీ బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలతో నింపాలను పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలుగుతమ్ముళ్ళు ముందుగానే రోడ్లన్నీ పసుపుమయం చేశారు. తమ అధినేత వస్తున్న రహదారిని బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపుదామనుకున్న ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు తెలుగు తమ్ముళ్ళ నిర్వాకంతో చిర్రెత్తుకొచ్చింది. ఖాళీ ఉన్న చోట బ్యానర్లు కట్టి కొన్ని చోట్ల తెలుగుతమ్ముళ్ళు కట్టిన బ్యానర్లను తొలగించి తమ బ్యానర్లు కట్టుకునే ప్రయత్నం చేశారు. ఈదశలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, వాదోపవాదాలు చోటుచేసుకున్నారు. పోలీసులు రంగంలో దిగి వారిని వారించారు. గత రెండు రోజులుగా రాత్రుల సమయంలో ఇదే తంతు కొనసాగుతోంది. మైలవరం సీఐ పి రామచంద్రరావు, ఎస్‌ఐ జి రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ పికెట్‌ను కొనసాగిస్తూ శాంతి భద్రతలను అదుపులోకి తెస్తున్నారు. వెల్వడం, గణపవరం గ్రామాలలో వైసీపీ నేతలకు బ్యానర్లు కట్టే ఖాళీ లేకుండా చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ జోగి రమేష్, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కాజా రాజ్‌కుమార్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలున్నాయి. ఈనేపధ్యంలో ఇరువర్గాల కార్యకర్తలు, నేతలు బ్యానర్లు కట్టే విషయంలో స్వల్పంగా ఘర్షణ పడ్డారు కూడా.