కృష్ణ

‘ఆసీఫా’కు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): జమ్మూ కాశ్మీర్‌లో కామాంధుల చేతుల్లో పైశాచిక దాడికి గురై మృతి చెందిన చిన్నారి ఆసీఫా కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం యువత చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు సంఘీభావం తెలిపారు. లక్ష్మీటాకీసు సెంటరు నుండి జిల్లా కోర్టు సెంటరు వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో వారు పాల్గొని ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు పసి పిల్లలను కూడా చిదిమేస్తున్న కామాంధులను శిక్షించేందుకు చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, టీడీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.