కృష్ణ

ఏ ముఖం పెట్టుకుని జనంలోకి వస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: అభివృద్ధికి అడ్డం పడే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి జనంలో తిరిగే అర్హత ఎంతమాత్రం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆంధ్రభూమితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ జగన్ చేస్తున్నది కొంగ జపమేనని విమర్శించారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని అమరారామం ఇలా ప్రతి అభివృద్ధి పనినీ తూర్పారబడుతూ ‘విమర్శలే’ ధ్యేయంగా కాలం నెట్టుకొస్తున్నారని ఆయన అన్నారు. ‘పాదయాత్ర’ పేరుతో పబ్బం గడుపుకుంటూ ‘చీప్ పాలిటిక్స్’ చేస్తున్నారని విమర్శించారు. జైలు పక్షికి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఆ పార్టీ నాయకులు బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నాయకులను ప్రజలు అసెంబ్లీకి ఎందుకు పంపారో కూడా తెలియకుండా, వాటిని బహిష్కరించడం ద్వారా తామెందుకు ‘ఎన్నికయ్యామో’ కూడా తెలియకుండా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. అసంబద్ధ ప్రేలాపనలు పేలుతూ ‘ఆహా ఓహో’ అని వారికి వారే డప్పేసుకోవడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. పట్టిసీమ నుండి గోదావరి జలాలను కృష్ణాకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టుకు ప్రాణం పోసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబని స్పష్టం చేశారు. కేసుల నుండి తప్పించుకోడానికి విజయసాయరెడ్డిని పావుగా వాడుకుంటూ బీజేపీకి మోకరిల్లారని, హోదా పేరిట వారు చేపట్టిన ‘జాతర’ కూడా దానిలో భాగమేనన్నారు. జగన్‌కు కావాల్సింది ప్రజా సంక్షేమం కాదని ‘పదవే’నని స్పష్టమవుతోందని మంత్రి ఉమ విమర్శించారు. ‘పదవుల కోసం’ ఎంతగా దిగజారుతాడోనని ‘విమర్శలే’ అద్దం పడుతున్నాయని అన్నారు. దొంగ కంటికి అందరూ దొంగలుగానే కనిపిస్తారని, దొంగే దొంగ... దొంగ అన్నట్టు జగన్ విమర్శలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వారం వారం కోర్టుకు వెళుతున్న ఆయన, ఎవరు దొంగో జనానికి తెలుసని మంత్రి ఉమ చెప్పారు. ఆయన కోర్టు కేసుల భాగోతం జనానికి తెలియకూడదన్న దుష్ట ఆలోచనతో ‘పాదయాత్ర’ పేరిట కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా తగిన విధంగా బుద్ధి చెప్పడానికి వారు సిద్ధమేనన్న విషయం జగన్ మరవకూడదని మంత్రి ఉమ హితవు పలికారు. పట్టిసీమకు అడ్డం పడడం ద్వారా కృష్ణా ఆయకట్టును వల్లకాడు చేయాలన్న జగన్ దుష్టపన్నాగాన్ని ముఖ్యమంత్రి ముందుగానే కనిపెట్టారని అన్నారు. జిల్లా ప్రగతికి అడ్డం పడాలని చూసి ఇప్పుడు ‘పాదయాత్ర’ పేరుతో జనంలోకి ఎలా వెళ్లగలుగుతున్నారని, వారి ముఖం ఎలా చూడగలుగుతున్నారని ప్రశ్నించారు. తన చుట్టూ ‘సొంత సైన్యాన్ని’ ఏర్పాటు చేసుకుని చేసే ‘వాకింగ్’ను ప్రజలు బాగానే అర్థం చేసుకుంటున్నారని మంత్రి ఉమ అన్నారు.