కృష్ణ

వెలగలేరులో జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ఆదివారం సాయంత్రం 4 గంటలకు జి.కొండూరు మండలంలోని వెలగలేరులో ప్రవేశించింది. జగన్ పాదయాత్రలో ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనికి ప్రవేశించే క్రమంలో మహిళలను సైతం వెళ్ళనీయకుండా అడ్డుకుని పక్కకు నెట్టేశారు. సమస్యలు చెప్పుకోడానికి సాధారణ ప్రజలకు అవకాశం ఇవ్వడం లేదు. జగన్ నడిచే బలమైన తాడు వలయం లోపల వైసీపీ రాష్ట్ర, జిల్లా నాయకులే ఉంటున్నారు. జగన్‌తో పాటు వారు కూడా లోపలే ఉండి నడుస్తున్నారు. దీని వల్ల సామాన్యులకు జగన్‌ను చూసి, మాట్లాడే అవకాశం ఉండటం లేదు. దీంతో మహిళలు నిరుత్సాహపడుతున్నారు. జగన్ ఇప్పటికైనా మేల్కొని పాదయాత్రలో తాడు వలయం లోపల నాయకులను పక్కకు తప్పించి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ పాదయాత్రలో మందుబాబుల హడావిడి ఎక్కువైంది. సైలెన్సర్లను పీకి ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు ఎక్కి విన్యాసాలు చేస్తున్నారు. శబ్దకాలుష్యంతో చెవులు పగిలిపోతున్నాయి. పోలీసు వాహనాల ముందే ఇదంతా జరుగుతుండటం గమనార్హం. జగన్ పాదయాత్రలో కార్యకర్తలు, యువకుల పైత్యం కారణంగా వికృత చేష్టలను చూసిన జనం వారిని అసహ్యించుకుంటున్నారు. ఇదేనా వైఎస్‌ఆర్ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాలో అడుగుపెట్టినప్పడు ఉన్న ఉత్సాహం కార్యకర్తల్లో ఆదివారం కనిపించలేదు. పాదయాత్రలో రెగ్యులర్‌గా ఉండే సిబ్బంది, నాయకులు తప్పించి ప్రజల నుంచి భారీగా స్పందన కనిపించలేదనే చెప్పాలి. జగన్ మాత్రం వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగి సాయంత్రం 6.20 గంటలకు జి.కొండూరు మండలంలోనే కందులపాడు క్రాస్‌రోడ్ వద్ద విశ్రాంతి కోసం ఆగారు. వెలగలేరులో కంటే కందులపాడు క్రాస్‌రోడ్ వద్ద జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. మార్గమధ్యంలోని కొన్ని ప్రధాన కూడళ్ళలో మాత్రం జగన్ మహిళలను పిలిచి వారిని ఆప్యాయంగా పలుకరించి మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు.