కృష్ణ

కేసుల సత్వర పరిష్కారానికి ‘లోక్ అదాలత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇరుపక్షాలను ఆనందంగా ఉంచడమే లోక్ అదాలత్‌ల లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు మాట్లాడుతూ రాజీ ద్వారా పరిష్కరించదగ్గ కేసులన్నింటినీ లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తున్నామన్నారు. ఇరుపక్షాల పరస్పర ఒప్పందంతోనే కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. న్యాయమూర్తులపై పని భారం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. జిల్లాలో ఏడాదికి 18వేల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్, న్యాయమూర్తులు డా. ఎం రామకృష్ణ, డా. ఎస్‌ఎస్ జయరాజు, మల్లిఖార్జునరావు, రజని, పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోగంటి సాయి మోహన్, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పుండరీకాక్షయ్య, పోలీసు, రెవెన్యూ, బ్యాంకింగ్, బీమా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.

న్యాయదేవత సాక్షిగా

వృద్ధ దంపతులకు మళ్లీ పెళ్లి

మచిలీపట్నం (లీగల్), ఏప్రిల్ 22: పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఆ వృద్ధ దంపతులు ఆదివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో న్యాయదేవత సాక్షిగా మళ్లీ ఒకటయ్యారు. వారి శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడిపేందుకు గాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు సమక్షంలో మళ్లీ వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. పట్టణానికి చెందిన గుండ్లపల్లి వెంకటేశ్వరరావు (68) ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తూ పదవీ విరమణ చేశారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి (60)తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా పదేళ్ల క్రితం విడిపోయారు. 2017వ సంవత్సరంలో న్యాయస్థానం ద్వారా వీరు విడాకులు సైతం తీసుకున్నారు. ఆ తర్వాత మనోవర్తి కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. మనోవర్తి చెల్లించేందుకు సైతం వెంకటేశ్వరరావు సిద్ధపడగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు చొరవతో ఇరువురికి కౌనె్సలింగ్ నిర్వహించారు. దీంతో వారు ఇరువురు మళ్లీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు గాను ఆదివారం జరిగిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తి సమక్షంలో భాజాభజంత్రీల నడుమ పెళ్లి చేసుకున్నారు. దంపతులిద్దరినీ న్యాయమూర్తి లక్ష్మణరావు ప్రత్యేకంగా అభినందించారు.