కృష్ణ

జగన్ పాదయాత్రతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు/ఆగిరిపల్లి: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర నూజివీడు మండలంలో ఆదివారంతో మధ్యాహ్నంతో ముగిసింది. శనివారం నూజివీడులో సాగిన ప్రజాసంకల్పయాత్ర సాయిప్రణతి స్కూల్‌వరకూ సాగి రాత్రి జగన్ అక్కడ బసచేశారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన జగన్ పాదయాత్ర నూజివీడు మండలం కొత్తూరు, రావిచర్ల అడ్డరోడ్డు వరకూ సాగింది. రాబోయేది తమ ప్రభుత్వమేనని తమ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని భరోసా ఇస్తూ జగన్ పాదయాత్ర ముందుకు కదిలింది. జగన్ పాదయాత్ర వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. పాదయాత్రలో ఏలూరు పార్లమెంటు అభ్యర్థి కోటగిరి శ్రీ్ధర్, తిరువూరు ఎమ్మెల్యే కె రక్షణనిధి, పార్థసారధి, ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఆగిరిపల్లిలో అడుగడుగునా ఆప్యాయత పలకరింపులు
మహిళామణుల హారతులు, చిన్నారుల ఆప్యాయత పలకరింపులు, వృద్ధుల ఆప్యాయత, దీవెనలతో, అడుగడుగునా కార్యకర్తల బ్రహ్మరథంతో ఆగిరిపల్లి మండలంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ఘనంగా సాగింది. ఆదివారం సాయంత్రం రావిచర్ల అడ్డరోడ్డు దాటిన తరువాత వడ్లమాను గ్రామం నుండి ఆగిరిపల్లి వరకు ప్రజా సంకల్పయాత్ర సాగింది. జగనన్న రావాలి జగనన్న కావాలి అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. పాదయాత్ర సాగిన ఆద్యంతం చిరునవ్వుతో ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ యాత్ర ముందుకు సాగింది. పాదయాత్రలో జగన్ వెంట ఎంపీ వరప్రసాద్, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, వైసీపీ ముఖ్య నాయకులు బొత్స సత్యనారాయణ, వంగవీటి రాధాకృష్ణ, కోటగిరి శ్రీ్ధర్, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హనుమాన్‌జంక్షన్ సిఐ నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సోమవారం చినాగిరిపల్లి, తోటపల్లి గ్రామాల్లో జగన్ పాదయాత్ర జరుగుతుందని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణకు సామాజిక పోలీసింగ్

కూచిపూడి, ఏప్రిల్ 22: గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సామాజిక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి పేర్కొన్నారు. కూచిపూడి గ్రామంలోని పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం స్మృతి సదనంలో ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు చేపడుతున్న ఆందోళనలతో ఎటువంటి శాంతిభద్రతలు విఘాతం కలగటం లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులను సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు, మహిళా ప్రతినిధులతో కమిటీలు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి సీఐ బి జనార్ధనరావు, కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్, శ్రీకాంత్, అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.