కృష్ణ

సునామీ హెచ్చరికలతో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 24: సునామీ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఇన్‌కాయిస్) సమాచారం మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదం ఉందని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే పడే అవకాశం ఉండగా రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఒకవేళ వెళ్లినా వారికి సమాచారం ఇచ్చి తిరిగి రప్పించాలని మత్స్య శాఖాధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో 08672-252847 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సముద్ర ప్రాంతాలైన ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ కమిటీలు, రెడ్‌క్రాస్ వంటి సహాయ సంస్థలు అప్రమత్తం కావాలని కలెక్టర్ కోరారు.