కృష్ణ

ఉత్తమ సర్పంచ్ పిచ్చేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: గ్రామీణాభివృద్ధిలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన మొవ్వ సర్పంచ్ తాతినేని పిచ్చేశ్వరరావు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభా పురస్కార అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా అందుకున్నారు. జిల్లా నుండి ఎంపికైన ఏకైక సర్పంచ్ పిచ్చేశ్వరరావు కావటం జిల్లాకే గర్వకారణమని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సర్పంచ్ పిచ్చేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారని ఎంపీడీఓ ఆనందరావు తెలిపారు. అవార్డును అందుకున్న సర్పంచ్ పిచ్చేశ్వరరావును ఎంపీపీ కిలారపు మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, ఎంపీటీసీ కంభం రామలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు తాతా వీర దుర్గాప్రసాద్, మండల ప్రత్యేక అధికారి డా. ఎం శ్రీనివాసరావు, ఇఓపీఆర్‌డి ఎస్ శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ బి రామానాయక్, ఇఓ జె రాజేంద్రప్రసాద్, తాతినేని పూర్ణచంద్రరావు, మండవ కోటేశ్వరరావు తదితరులు అభినందించారు.

జెడ్పీకి జాతీయ పురస్కారం

* కేంద్ర మంత్రి నుండి అవార్డు అందుకున్న అనూరాధ

మచిలీపట్నం, ఏప్రిల్ 24: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. భారత రాజ్యాంగానికి లోబడి విధి విధానాలు అమలు పర్చటంతో పాటు వివిధ పద్దుల ద్వారా వస్తున్న నిధులు ఆయా వర్గాలకే కేటాయించడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి గాను జిల్లా పరిషత్‌ను దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ పురస్కారానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు.

పల్లెల ప్రగతితోనే నిజమైన స్వాతంత్య్రం

* పంచాయతీ రాజ్ దినోత్సవంలో ఎంపీ కొనకళ్ల

మచిలీపట్నం, ఏప్రిల్ 24: పల్లెలు ప్రగతి సాధించిన్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. వ్యవసాయ రంగంపై 80 శాతం ప్రజలు ఆధారపడ్డారని, వ్యవసాయం బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సీఎం చంద్రబాబు దూర దృష్టితో పట్టిసీమ ద్వారా సాగు, తాగునీరు అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ రాజ్ వ్యవస్థ కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామస్వరాజ్యం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు అవార్డులను ప్రదానం చేశారు. జెడ్పీ సీఇఓ కె శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌విఆర్ ఆనందబాబు, డెప్యూటీ సీఇఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.