కృష్ణ

వేసవిలో మంచినీటి ఎద్దడి రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 26: వేసవి దృష్ట్యా పట్టణంలో మంచినీటి ఎద్దడి రానివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. గురువారం చైర్మన్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంచినీటి ఎద్దడి నివారణకు తీసుకున్న చర్యలను చైర్మన్ సభ్యులకు వివరించారు. ఇప్పటికే తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ను పూర్తి స్థాయిలో నింపామన్నారు. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. అజెండాలోని 35 అంశాలను చర్చించి తీర్మానించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.