కృష్ణ

నేడే పాలిసెట్-2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2018-19 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ ప్రవేశానికి గాను గురువారం జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 13వేల 708 విద్యార్థులు హాజరు కానున్నారు. విజయవాడ నగరంలోనే అత్యధికంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేయగా 6వేల 769 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఐదు కేంద్రాలు, నందిగామలో ఎనిమిది, అవనిగడ్డలో రెండు, తిరువూరులో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పాలిసెట్-2018 జిల్లా సమన్వయకర్త విఎస్ చలపతిరావు తెలిపారు. నూరు శాతం హాల్ టిక్కెట్ల పంపిణీ పూర్తయిందన్నారు. ఎవరికైనా హాల్ టికెట్టు అందని పక్షంలో సంబంధిత కళాశాలల నుండి గానీ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలని ఆయన కోరారు.

పట్టిసీమ వల్లే కృష్ణాడెల్టాలో పంటలు

గుడివాడ, ఏప్రిల్ 26: పట్టిసీమ ప్రాజెక్ట్ వల్లే కృష్ణాడెల్టాలో పంటలు పండుతున్నాయని జలవనరులశాఖ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు చెప్పారు. స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో జగన్మోహనరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిల దిష్టిబొమ్మలను గురువారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ మాట్లాడుతూ పట్టిసీమ దండగ అని, ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని జగన్, కొడాలి నానిలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టిసీమపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, వైసీపీ సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శాయన పుష్పావతి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, కౌన్సిలర్లు శొంఠి రామకృష్ణ, షేక్ బాజీభాషా, పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.