కృష్ణ

డెల్టా ద్రోహి జగన్ యాత్రను బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను తీవ్రంగా అడ్డుకున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్రను బహిష్కరించాలని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు డెల్టా రైతాంగానికి పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం శూన్యమని చెప్పటంతో పాటు పోలవరం పనులను అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో సైతం కేసులు వేయించిన జగన్‌కు కనువిప్పు కలిగించే విధంగా ఆయన చేస్తున్న యాత్రను బహిష్కరించటంతో పాటు ప్రజలంతా నిలదీయాలన్నారు. పట్టిసీమ ద్వారా నేడు డెల్టా ప్రాంతం సస్యశ్యామలంగా ఉందని, పోలవరం నిర్మాణ పనులను 52.5శాతం పూర్తి చేశామన్నారు. జగన్ యాత్రకు జిల్లా ప్రజానీకం కరువయ్యారన్నారు. మనిషికి రూ.500లు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మరీ పక్క జిల్లాల నుండి జనాన్ని తీసుకు వస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీతో లాలూచి పడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. ప్రధాని మోదీని విమర్శించే ధైర్యం జగన్‌కు లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ధర్మపోరాటంలో ఏ మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. కేంద్రం మెడలు వంచైనా ధర్మ పోరాటంలో గెలిచి తీరుతామన్నారు. గ్రామాల వారీగా నిర్వహిస్తున్న టీడీపీ సైకిల్ ర్యాలీలకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఈ నెల 30వ తేదీన తిరుపతి తారకరామ స్టేడియంలో లక్ష మందితో నమ్మక ద్రోహం - కుట్ర రాజకీయాలపై ధర్మపోరాట మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు జిల్లా నుండి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కమిటీ ప్రతినిధులు తరలి వెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ అర్జునుడు తెలిపారు. ఈ సమావేశంలో ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.