కృష్ణ

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తామని, ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ యాత్రలో భాగంగా గురువారం మండలంలోని మొర్సుమిల్లిలో సైకిల్ యాత్ర నిర్వహించిన అనంతరం సెంటర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. విభజన అనంతరం రాష్ట్రం పీకలలోతు అప్పుల ఊబిలో ఉందని రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి కేంద్రంతో కలిసి పని చేశామని నాలుగేళ్ళు గడచినా హోదా ఇవ్వకపోగా ప్యాకేజీ సొమ్ము కూడా ఇవ్వలేదని, కనీసం బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని ఎదిరించి కేంద్రం నుండి బయటికి వచ్చి హోదా కోసం పోరాటం చేస్తున్నామని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కానీ అక్రమ ఆస్తుల కేసులో వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతున్న జగన్ మాత్రం తన కేసులను మాఫీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టుపెట్టి కేంద్రంతో లాలూచీ పడ్డాడని దుయ్యబట్టారు. ఇటువంటి ఆర్థిక నేరగాడు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ద్వారా మైలవరం వచ్చి తనను, చంద్రబాబును తిడుతున్నాడని ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చెరువులలో, పొలాలో నీరు పుష్కలంగా ఉంటే తాను నీరివ్వటం లేదని జగన్ ఆరోపణలను ఖండించారు. మైలవరానికే కాదు జగన్ హయాంలో, ఆయన తండ్రి వైఎస్, ఆయన తల్లి విజయమ్మ హయాంలో ఇవ్వలేని సాగునీటిని పులివెందుల గడ్డపై తొడకొట్టి తన హయాంలో ఇచ్చానని పేర్కొన్నారు. తన శాఖ ద్వారా 53వేల కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు నిర్మించి ఒక్క ఎకరా పంట కూడా ఎండనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలే తమకు ముఖ్యమని ఈక్రమంలో మోదీయే కాదు ఎవరినైనా ఎదురిస్తామని ప్రజలే తమకు హైకమాండ్ అన్నారు. హోదా కోసం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి తలమానికమైన పోలవరం యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, పట్టిసీమ ద్వారా లక్షలాది ఎకరాల పంటను కాపాడామని, చింతలపూడి ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి రప్పించి శిరులు పండిస్తామని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.