కృష్ణ

స్థల వివాదం పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): క్రీడల శాఖ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థల మద్య వివాదాస్పదంగా ఉన్న 9.3 ఎకరాల స్థల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి అన్నారు. మంగళవారం జెడ్పీ సెంటర్ సమీపంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా శిక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రభుత్వానికి చెందిన రెండు సంస్థలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మంత్రి రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడతానన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.55 కోట్లు కేటాయించినట్లు సంధ్యారాణి తెలిపారు. ఈ నెల 30వ తేదీన 13 జిల్లాల కమిటీలతో అభివృద్ధి-నిధుల కేటాయింపులపై సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు రూ.5వేలు నుండి రూ.25వేలు అభివృద్ధి నిమిత్తం కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. తొలుత వివాదాస్పద స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి కరీంశెట్టి కైలాసపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎంవి రాజ్యలక్ష్మి, స్కౌట్స్ ఉపాధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, రాష్ట్ర స్కౌట్స్ కమిషనర్ ఎంవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్ పోసి టీడీపీ నాయకుల నిరసన

అవనిగడ్డ, మే 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం స్థానిక పెట్రోల్ బంక్‌లో వాహనాలకు పెట్రోల్ నింపి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే హోదా ప్రకటించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ గాజుల మురళీకృష్ణ, యాసం చిట్టిబాబు, మెగావత్‌గోపి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అంధ గాయకునికి మైక్‌సెట్ బహూకరణ

మైలవరం, మే 15: ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు రెండో తనయుడు నిరాహుల్‌రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అంధగాయకునికి ఒక దాత మైక్‌సెట్‌ను బహూకరించారు.