కృష్ణ

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కర్ణాటకలో బీజేపీ గెలుపు ప్రజల గెలుపు అని, కర్ణాటక తెలుగువారిలో చిచ్చుపెట్టి కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలని కుట్ర పన్నిన చంద్రబాబు నాయుడుకు చెంపదెబ్బ లాంటిదని బీజేపీ నాయకురాలు, సినీనటి కవిత అన్నారు. రాష్ట్రం నుంచి అశోక్‌బాబు, శివాజీ వంటివాళ్లను, టీడీపీ కార్యకర్తలను పంపించి కర్ణాటకలో తెలుగువారి మధ్య చిచ్చు పెట్టటానికి ప్రయత్నించినప్పటికీ తెలుగువారంతా ఒక్కటిగా బీజేపీని గెలిపించడం హర్షణీయమన్నారు. కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రంలో టీడీపీకి పరాజయం తప్పదని, బీజేపీ ప్రబల శక్తిగా ఎదిగి అధికారం చేపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ గెలిచిన సందర్భంగా కర్ణాటకలోని శనీశ్వర ఆలయంలో మొక్కు తీర్చుకోడానికి కవిత వెళ్లారు.