కృష్ణ

అరచేతిలో పుష్కర సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 30: ఆగస్టు నెలలో నిర్వహించే కృష్ణా పుష్కరాలకు 100 రోజుల సమయం ఉందని కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందించేందుకు టెలిఫోన్ నెట్‌వర్క్ ప్రొవైడర్స్ కంపెనీల వెండర్లు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ బాబు ఎ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశమందిరంలో ట్రిబుల్ ఐటి అధికారుల సమక్షంలో మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్, సబ్ కలెక్టర్ జి సృజన, డిడిఓ అనంతకృష్ణ ఆధ్వర్యంలో వెండర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాల సందర్భంలో అనుసరించిన సాంకేతిక నైపుణ్యానికి మరింత పరిణితితో కూడిన సమాచార వ్యవస్థను అభివృద్ధి పరచాల్సి ఉందన్నారు. పుష్కర స్నానానికి వచ్చే యాత్రికులు వారు వచ్చే ప్రదేశం నుంచి పుష్కర ఘాటుకు చేరుకునే వివరాలను వారి ఇంటి వద్ద నుండే తెలుసుకునే ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలాగా సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కృష్ణాజిల్లాలో 110కిపైగా పుష్కరఘాట్లను గుర్తించడం జరిగిందని, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే నిఘా కెమెరాలకు అదనంగా సాంకేతిక బృందం కూడా కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు యాత్రికుల సమాచారాన్ని అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ పుష్కరనగర్‌లలో అన్ని వసతులను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయా ప్రాంతాల నుండి బస్సులను పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ బాధ్యతను చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.