కృష్ణ

రసపట్టుగా పెడన వైసీపీ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన: మరోసారి పెడన నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు తొలి రోజే చుక్కెదురైంది. పెడన నియోజకవర్గ శాసనసభ్యునిగా పని చేసిన తర్వాత గత ఎన్నికల్లో మైలవరం నుండి పోటీ చేసి ఓడిపోయిన జోగి రమేష్‌ను ఇటీవల పెడన నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్తగా నియమితులయ్యారు. దీంతో ఇప్పటి వరకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఉప్పాల రాంప్రసాద్ వర్గం ఒక్కసారిగా ఉలికిపడింది. ఏ నియోజకవర్గంలోనూ లేనటువంటి అదనపు సమన్వయకర్త పోస్టును జోగికి కేటాయించడంతో రానున్న ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఎవరకనే దానిపై స్పష్టత లోపించింది. అదనపు సమన్వయకర్తగా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమవారం పెడన వచ్చిన జోగికి రాంప్రసాద్ నుండి సహాయ నిరాకరణ ఎదురైంది. తొలుత పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న జోగికి ఆయన వర్గం నుండి ఘనస్వాగతం లభించింది. పూజా కార్యక్రమాలు ముగించుకున్న జోగిరమేష్ నేరుగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి వెళ్లి ఉప్పాల రాంప్రసాద్‌ను కలిశారు. పార్టీ కోసం ఇద్దరం కలిసి పనిచేద్దామని, మీ సహకారం కావాలంటూ జోగి ఉప్పాలను అభ్యర్థించారు. జోగి రాకతో గుర్రు మీద ఉన్న ఉప్పాల రాంప్రసాద్ మీకు నా సహకారం ఉండదని తేల్చి చెప్పేశారు. మీ పని మీదే నా పని నాదే అని ఖచ్చితమైన సమాధానాన్ని జోగికి ఇచ్చారు. జోగి రాకతో మీడియా హడావుడిని చూసిన రాంప్రసాద్ ఇక్కడ ఎవ్వరూ ప్రెస్‌మీట్ పెట్టడం లేదనటంతో అక్కడ ప్రెస్‌మీట్ పెట్టాలన్న ఆలోచనను జోగి రమేష్ ఉపసంహరించుకుని అక్కడి నుండి వెళ్లిపోయి ది గాంధి వీవర్స్ సొసైటీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో జోగిరమేష్ వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పంపిస్తేనే తాను పెడన వచ్చానని చెప్పారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి పెడనలో పోటీ చేయమంటే చేసి విజయం సాధించానన్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మైలవరం నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేశానన్నారు. మళ్లీ జగన్ ఆదేశాల మేరకు పెడనలో పార్టీ బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. మరో 15 రోజుల్లో మైలవరం నుండి వచ్చి పెడనలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిఒక్కరిని కలుపుకుని వెళ్లాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. జోగి రాకతో ఒక్కసారిగా పెడన నియోజకవర్గ వైసీపీలో కలకలం రేగింది. నిన్నటి వరకు రాంప్రసాద్‌తో తిరిగిన నాయకులు, కార్యకర్తల్లో కొంతమంది జోగిరమేష్ పక్కకు వెళ్లడం మరింత చర్చనీయాంశమైంది. కృత్తివెన్ను మాజీ జెడ్పీటీసీ పట్టపు నాగేశ్వరరావు, బంటుమిల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తాతాజీతో పాటు పట్టణానికి చెందిన కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపీప్రసాద్, మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్, గూడూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సంగా మధు, బళ్ల గంగయ్య తదితరులు జోగికి ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్, ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావుతోపాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు రాంప్రసాద్ పక్కనే ఉండటం విశేషం. రానున్న రోజుల్లో ఉప్పాల రాంప్రసాద్, జోగి రమేష్ వర్గాల మధ్య రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేడు ఎన్‌ఐడీఎం శంకుస్థాపనకు రంగం సిద్ధం
గన్నవరం, మే 21: కొండపావులూరు గ్రామంలో మంగళవారం జరిగే ఎన్‌ఐడీఎం శంకుస్థాపనకు రంగం సిద్ధం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం ఏర్పాట్లు పర్యవేక్షించారు. భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు ప్రసంగించే సభావేదికను ఎన్‌ఐడీఎం అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ఎన్‌ఐడీఎంకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రజలకు సందేశం ఇస్తారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రహదారికి ఇరువైపుల పచ్చని మొక్కలు నాటారు. గన్నవరం నుండి కొండపావులూరు సభా ప్రాంగణం వరకు రహదారిని శుభ్రపర్చారు. కలెక్టర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి తగు సూచనలను చేశారు. దుమ్ము, ధూళి లేవకుండా నీళ్లు చల్లాలని ఆదేశించారు. డీసీపీ గజరావు భూపాల్, ఏసీపీ విజయభాస్కర్, సీఐ శ్రీ్ధర్‌కుమార్ శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.