కృష్ణ

‘రొయ్యల’ రైతులకు మద్దతు ధర కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రొయ్యల రైతులకు కనీస మద్దతు ధర కల్పించే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంతో పాటు నూజివీడు, గుడివాడ డివిజన్‌లలో నిర్వహించిన ‘మీకోసం’ ద్వారా వచ్చిన అర్జీలపై ఆయన విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా వచ్చిన అర్జీల గురించి అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నంలో రొయ్యల సాగు చేస్తున్న రైతులు మద్దతు ధర ఇవ్వాలంటూ ‘మీకోసం’లో అర్జీ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మద్దతు ధర విషయమై వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషాకు సూచించారు. నందిగామ మండలం పెద్దవరం గ్రామానికి చెందిన పలువురు 50 సంవత్సరాల నుండి చెరువుకొమ్ముపాలెం, కొత్తబెలం, కొండవారిపాలెం, పెద్దవరం గ్రామ పంచాయతీకి శివారు గ్రామాలుగా ఉన్నందున అభివృద్ధికి నోచుకోవడం లేదని మీకోసంలో విన్నవించుకున్నారు. ఈ మూడు గ్రామాలను ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని అర్జీ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆయా గ్రామాలను సందర్శించి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీకోసం’లో ట్రైనీ కలెక్టర్ ఖాజావలీ, ముడ వీసీ విల్సన్ బాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.