కృష్ణ

సులోచనారాణి మృతితో మూగబోయిన నవలా ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: ప్రముఖ నవల రచయిత్రి యద్ధనపూడి సులోచన రాణి మృతితో కాజ గ్రామం మూగబోయింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన నెమలికంటి చలపతిరావు, మహాలక్ష్మి దంపతుల 6వ కుమార్తెగా సులోచనరాణి జన్మించింది. చలపతిరావు దంపతులకు తొమ్మిది మంది సంతానం. ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. 1940లో సులోచనరాణి కృష్ణాజిల్లా తొలి కలెక్టర్ కార్యాలయం గల కాజ గ్రామంలో జన్మించారు. సులోచనరాణి 10వ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, ప్రస్తుత పేకేటి నర్సారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. చిన్ననాటి నుండి సమాజంలో జరుగుతు న్న మార్పులు, మహిళల వెనుకబడిన విధానం ఆమెలో ఆలోచనలు రేకెత్తించాయి. 18వ యేట కంచికచర్ల మండలం జుజ్జూరుకు చెందిన యద్ధనపూడి నరసింహారావుతో వివాహమైంది. సులోచనరాణి సమకాలికులైన పేకేటి కృష్ణమూర్తిరెడ్డి, పేకేటి శాంతారెడ్డిలతో స్నేహంగా ఉండేవారు. ఈమె 3వ సోదరుడు నెమలకంటి రాధాకృష్ణమూర్తి హైదరాబాద్‌లోని బీహెచ్‌ఇఎల్‌లో ఉ ద్యోగం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమె మేనల్లుడు నెమలకంటి శ్రీనివాస్, మేనకోడలు రాయపాటి సీతామహాలక్ష్మి మచిలీపట్నంలో నివసిస్తున్నారు. యద్ధనపూడి సులోచనరాణి, నరసింహారావు దంపతులకు ఏకైక కుమార్తె శైలజ. ప్రస్తుతం అమెరికాలోని కాలిపోర్నియాలో నివశిస్తున్నారు. సోమవారం అమెరికాలో గుండెపోటుతో సులోచనరాణి మృతి చెందటంతో నవలా ప్రపంచం చిన్నబోయింది. ఈమె రచించిన పలు నవలలు చలనచిత్రాలుగా రూపొందా యి. ఇందులో సెక్రటరీ నవల చలనచిత్రంగా రూ పొంది మహిళల్లో చైతన్యం పెంపొందించింది. ఈ చిత్రం 50వ వార్షికోత్సవాన్ని ఇటీవల ఘ నంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి యద్ధనపూడి సులోచనరాణి మృతిపట్ల చరిత్ర పరిశోధకులు యద్ధననపూడి బాబూరావు, నా ట్యాచార్య పసుమర్తి కేశవప్రసాద్, డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, గ్రామ సర్పంచ్ మందా సుధారాణి, మందా శ్రీనివాసరెడ్డి, పేకేటి సీతారామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వ ట్రపు మంగాలక్ష్మి, ఎంపీటీసీ రాయవరపు అరుణ కుమార్ తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సులోచనరాణి తండ్రి నెమలక ంటి చలపతిరావు వంశపారంపర్యంగా కాజ కర్ణంగా పని చేశారు. అలాగే ఆ యన గ్రామ సర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యారు.