కృష్ణ

నగరంలో స్వచ్చ మిషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: నగరంలో స్వచ్చ మిషన్‌ను పూర్తిస్థాయిలో అమలుకు 167కోట్లతో అంచనాలను సిద్ధం చేసినట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి కార్యదర్శి రాజీవ్‌గౌబా శనివారం విశాఖపట్నం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ బాబు.ఎ తో కలిసి పాల్గొన్న విఎంసి కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో 96శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశామని, మిగిలిన వాటిని జూలై 15కల్లా పూర్తిచేస్తామని తెలిపారు. 15కోట్లతో రూపొందించిన డిపిఆర్ అమలును స్వచ్చంద సంస్థలు, సిఎస్‌ఆర్ విధానంలో 3 దశల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చర్యలు తీసుకొంటున్నట్టు వివరించారు. అంతేకాకుండా 167 కోట్లతో రూపొందించిన డిపిఆర్ తో నగరంలోని 85 ప్రాంతాలలో 56 కిలో మీటర్ల మేర మార్గాల్లో ఓడిఎఫ్ ప్రాంతాలుగా గుర్తించి స్వచ్ఛ మిషన్‌ను అమలు చేస్తున్నామన్నారు. నగరంలో ఉత్పత్తి అయ్యే 539 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా వివిధ చర్యలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ జిల్లాలోని 8మున్సిపాలిటీలు, 1 నగర పాలక సంస్థ పరిధిలో 9450 మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశామన్నారు. కృష్ణా పుష్కరాల భక్తులకు పలు రకాల వసతులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మే 15 నాటికి విజయవాడలోని బందర్‌రోడ్డు ప్రాంతాన్ని సిస్కో సాంకేతిక సహకారంతో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుతున్నట్టు తెలిపారు. అలాగే నగరంలోని పి డబ్లూ డి గ్రౌండ్‌ను విజయవాడ స్క్వేర్‌గా అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శి రాజీవ్‌గౌబా మాట్లాడుతూ 2017 అక్టోబర్ 2 నాటికి స్వచ్చ్భారత్‌ను ప్రపంచ స్థాయిలో విశిష్టమైన స్థానంలో నిలపాలని, ఇందుకు పూర్తి బహిరంగ మూత్ర, మల విసర్జన లేని దిశగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.184 కోట్లు గ్రాంటుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 77 కోట్లను అందించనున్నట్టు ఆయన తెలిపారు.