కృష్ణ

హోదా కోసం అన్ని పక్షాలు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): ప్రత్యేక హోదా సాధనకై అన్ని రాజకీయ పక్షాలు కలిసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్ దాదా అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కోనేరుసెంటరులో ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా సలార్ దాదా మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి ముడి పడి ఉందన్నారు. అటువంటి హోదాను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం హోదా అంశాన్ని మరుగున పెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా హోదా ఇచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటం గర్హనీయమన్నారు. బీజేపీ-టీడీపీ దురాఘతాలను ఎండగట్టేందుకు ప్రజలంతా ఒకటి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు, అబ్దుల్ మతీన్, దాదా సాహెబ్, కుమారి, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, సిహెచ్ జయరావు, సీపీఐ నాయకురాలు దేవభక్తుని నిర్మల తదితరులు పాల్గొన్నారు.

రమ్యకు ప్రతిభా పురస్కార్ అవార్డు
మైలవరం, మే 22: స్థానిక ఎస్వీఆర్టీఎన్నార్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదివి ఇటీవల పదవ తరగతి పరీక్షలలో పదికి పది జీపిఏ పాయింట్లు సాధించిన మైలవరానికి చెందిన గౌతు రమ్యకు ప్రతిభా పురస్కార్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈ బాలికకు విజయవాడ సమీపంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ బాలికకు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, మూడు వేల రూపాయల నగదు బహుమతిని అందించి సత్కరించారు. అవార్డు పొందిన ఈబాలికను పలువురు అభినందించారు.

శాశ్వత వంతెన నిర్మించాలి

కూచిపూడి, మే 22: మొవ్వ మండలం కాజ శివారు ఐనంపూడి డ్రెయిన్‌పై ప్రమాదభరితంగా ఉన్న బెయిలీ బ్రిడ్జి స్థానంలో విశాలమైన నూతన వంతెనను తక్షణమే నిర్మించాలని పరిసరాల గ్రామాల ప్రజలు నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. పామర్రు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి దగాని సంగీతరావు, మొవ్వ మండల సీపీఎం కార్యదర్శి శీలం ప్రకాశరావు ఆధ్వర్యంలో మొవ్వ, మచిలీపట్నం ఐఎన్‌కె రహదారిలోని కాజ వంతెన వద్ద గంటసేపు రాస్తారోకో చేపట్టారు. దశాబ్ధం కిందట శిథిలమైన ఐనంపూడి డ్రెయిన్‌పై ఉన్న వంతెనను నిర్మించాల్సిన ఆర్‌అండ్‌బి, డ్రైనేజి శాఖ అధికారులు బెయిలీబ్రిడ్జి నిర్మించి చేతులు దులుపుకోవటంతో ఈ రహదారిలో ప్రయాణించే వాహన చోదకులు, ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారని సంగీతరావు ఆవేదన వ్యక్తం చేశారు.