కృష్ణ

చెరువులు తవ్వనివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళస్థలాల పక్కనే చేపల, రొయ్యల చెరువుల తవ్వకాలు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ నందివాడ మండలం తమిరిశ శివారు అంకన్నగూడెం దళితులు మంగళవారం స్థానిక నాగవరప్పాడు వంతెనపై రాస్తారోకో చేశారు. సీపీఎం నాయకులు కూడా అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడకు చేరుకుని సీపీఎం తూర్పు కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్ రఘుతో పాటు కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌సీపీ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి మురాల రాజేష్, అంకన్నగూడెం వాసులు గం దాసు, సుధాకర్, నీలాంబరం, యెహోషువా, మోషే, డేవిడ్, గంధం ప్రసాద్, గంటా రమేష్, పి జయరాజు తదితరులను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత అంకన్నగూడెం మహిళలు పెద్దఎత్తున ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ధర్నాకు దిగారు. అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని, చెరువుల తవ్వకం అనుమతులను రద్దు చేయాలని, ప్రొక్లయిన్‌తో సహా స్థలం నుండి వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు. అనుమతులు రద్దు చేసే వరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అంతకు ముందు రఘు విలేఖర్లతో మాట్లాడుతూ పేదల స్థలాలను ఆనుకుని చెరువు తవ్వకాలను అనుమతులిచ్చిన రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చినా స్థానిక అధికారుల్లో చలనం లేదన్నారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేయాలని కోరిన దళితులు, సీపీఎం నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం గుడివాడ ఆర్డీవో ఎం చక్రపాణి మాట్లాడుతూ చెరువులకు అనుమతులిచ్చిన విషయాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలతో చెరువుల తవ్వకాలు చేస్తున్నారని, ఇరువర్గాలనూ కూర్చోబెట్టి ఎవరికీ నష్టం కలుగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి, కే సుబ్బారావు, సీపీఐ గుడివాడ ఏరియా కార్యదర్శి గూడపాటి ప్రకాష్‌బాబు, గుడిపూడి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.