కృష్ణ

వాకింగ్ వీరునికి ఓట్లు కల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: సీఎం కుర్చీ కోసమే పార్టీ పెట్టకూడదని... ప్రజా సేవ చేస్తూ పదవి పొందాలనుకో వడంలో కొం త అర్థం ఉం దని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యా నించారు. ఎకాఎకిన రాజకీయాల్లోకి రావడంతోనే సీఎం కుర్చీ ఎక్కిపోదామంటే ప్రజాస్వామ్య దే శంలో కుదరదని ఆయన వైసీపీ అధినేత జగన్ గుర్తుంచు కుంటే మంచిదని అన్నా రు. స్థానిక విలేఖరితో ఆయన మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడుతూ ‘కుర్చీ’ ఎక్కాలనుకుంటే కొంత ‘ఇమేజ్’ ఉండాలని అన్నారు. తండ్రి పోగేసిన ధనబలంతో ఉచ్ఛనీచాలు మరిచి అవాకులు చెవాకులు పేలుతుండడాన్ని విజ్ఞత కలిగిన ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎవర్ని ఎక్కడుంచాలో వారికి బాగా తెలుసని, సమయం వచ్చినప్పుడు తమ తడాఖా చూపిస్తారని చెప్పారు. కాలక్షేపం కోసం ‘వాకింగ్’ చేస్తే ఓట్లు రాలవని, ప్రజలకు మేలు చేసే పనులేమైనా చేయాలని ఆయన ప్రతిపక్ష నేత జగన్‌కు మంత్రి ఉమ హితవు పలికారు. ఉదయం ఓ గంట... సాయంత్రం మరో గంట వాకింగ్ చేస్తూ జగన్ గ్రామాల్లో వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. మధ్యమధ్య ప్రతి వారం ‘కోర్టు’ పేరిట హైదరాబాద్ వెళ్లి ‘రెస్టు’ తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘పోయేదేముంది ఓ హామీ పడేస్తే పోలా’ మనకు అధికారం ఎలాగూ రాదు... ‘అమలు చేయాల్సిన పనే లేదు’... ఇంతోటి దానికి ‘ఆలోచన’ అన్నది లేకుండానే అమలు సాధ్యం హామీలు గుప్పిస్తూ పోతున్నాడని దుయ్యబట్టారు. ఆయన వెళ్లిపోయాక ‘ఇది సాధ్యమేనా’ అని ప్రజలు, ఆ పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారని స్పష్టం చేశారు. ‘వాకింగ్ వీరునికి’ వచ్చే ఎన్నికల సంగ్రామంలో ఓటమి తప్పదని, ఇప్పుడున్నన్ని సీట్లు కూడా దక్కవని మంత్రి ఉమ అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా అనుమానమేనని ఆయన జోస్యం చెప్పారు. సెల్ఫీల సోగ్గాడికి ‘సృంగభంగం’ తప్పదని మంత్రి స్పష్టం చేశారు. ‘వాకింగ్ పేరిట సమయం వృధా చేసుకునే కన్నా’ ప్రజలకు ఉపయోగపడే నాలుగు మంచి పనులు చేసి వారి ఆదరాభిమానాలు పొందాలని సలహా ఇచ్చారు. తమ పార్టీ శ్రేణులు అని చెప్పుకునే వారి ధోరణి కూడా అలాగే ఉందని, అధినేత ‘మెప్పు కోసమే’ తప్ప ‘చిత్తశుద్ధి’ అణుమాత్రం లేదని మంత్రి ఉమ అన్నారు. ఆయన వాకింగ్‌కు వస్తున్నాడంటే అడుగడునా ‘ఫ్లెక్సీలు పాతుతున్నారని’ వాకింగ్ అయిపోయిన తరువాత వాటిని పీకేసి వ్యాన్లలో తరలించి మళ్లీ పాతున్నారని చెప్పారు. దీన్ని బట్టే వారిలో ఏపాటి ‘చిత్తశుద్ధి’ ఉందో అర్థం అవుతోందని అన్నారు. ఆయన ‘వాకింగ్’ ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియదని, ఎక్కడి నుండే ఏదో పీకుదామనుకుని ‘పీకే’వారినెవరినో తెచ్చుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. దీన్ని బట్టే ఆయనకు రాష్ట్రం అన్నా, రాష్ట్ర ప్రజలన్నా ఎంతటి గౌరవం ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆపాటి ‘ఘనాపాటి’లు రాష్ట్రంలో లేరని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. ప్రజలకు నయాపైసా సాయం చేయని ఆ అపర కుభేరుడు రాష్ట్రంలో ఓట్లు కొల్లగొట్టుకోడానికి మాత్రం ‘ఉత్తరాది ఘనాపాటి’ ఉచిత సలహాలకు ‘కోట్లు’ కుమ్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘మంత్రాలకు చింతకాయలు’ రాలనట్టే ‘పీకే’ సలహాలకు ‘ఓట్లు’ పడవని మంత్రి ఉమ పునరుద్ఘాటించారు.