కృష్ణ

మంచినీటి పథకానికి రూ.51 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన: పెడన పట్టణ ప్రజల మంచినీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.51కోట్ల 20లక్షలు మంజూరయ్యాయి. దీంతో 11 సంవత్సరాల నుండి చేస్తున్న కృషి ఫలించింది. ఇందుకు సంబంధించిన వివరాలను పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావ్ గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరించారు. నిధుల మంజూరు చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రానున్న సెప్టెంబర్ నెలలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం రూ.60కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ నిధులతో రిజర్వాయర్లు, పైప్‌లైన్‌లు, గ్రావిటీ మెయిన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. 2019 నాటికి పూర్తి చేసే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ పథకం అమలులోకి వస్తే రానున్న 50 సంవత్సరాల వరకు ప్రజలకు మంచినీటి సమస్య ఉండదని చెప్పారు. నాన్ అమృత పథకం కింద జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, పెడన పురపాలక సంఘాలకు ఈ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వివరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ గత చైర్మన్ పద్మజా కుమారి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 11 సంవత్సరాల నుండి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో ఈ పథకాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. మొత్తం 51 పురపాలక సంఘాలు నాన్ అమృత పథకంలో ఉన్నాయని, తొలి విడతగా 21 పురపాలక సంఘాలకు నిధులు మంజూరు కాగా రెండవ విడతగా పెడన పురపాలక సంఘానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.

కుదించిన బస్సు సర్వీసులు పునరుద్ధరించాలి

జగ్గయ్యపేట, మే 24: పట్టణ ఆర్‌టీసీ డిపోను ఇటీవల ఎండీగా బాధ్యతలు చేపట్టిన సురేంద్రబాబు సందర్శించారు. పట్టణ డిపోను, బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి డిపో స్థితిగతులపై అధికారుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఎండి సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి జగ్గయ్యపేట డిపోకు సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డీపోకు ఇటీవల తగ్గించిన పలు సర్వీస్‌లు, హైదరాబాదు - జగ్గయ్యపేటల మధ్య సర్వీసులు తదితర అంశాలను ఎండి దృష్టికి తీసుకురాగా వీటిపై తగు సమాచారం అందించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణాన్ని ఆయన సందర్శించి పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో డీఎం, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.