కృష్ణ

వ్యాపారులకు స్వేచ్ఛా వాతావరణం కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్రంలో వ్యాపార వర్గాలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం ఆయన కోనేరుసెంటరులోని మార్కెట్ వర్గాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తర్వాత సంబంధిత శాఖాధికారుల నుండి అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు వ్యాపారులు మంత్రి రవీంద్ర వద్ద వాపోయారు. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేశారు. నారకొట్ల బజారులో ఇనుప విద్యుత్ స్తంభాల వల్ల ముప్పు ప్రమాదం ఉందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి వారం రోజుల్లో కొత్త స్తంభాలు వేయిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే అధికారులతో సమావేశమై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి రవీంద్ర వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మామిడి మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.

టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారు

*ఏఎస్పీకి ఫిర్యాదు

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 24: కలియుగ దైవం తిరుమలేశుని ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తున్న టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, టీటీడీ మాజీ ఇఓ ఐవైఆర్ కృష్ణారావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షులు వేమూరి రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పీవీ ఫణికుమార్ నేతృత్వంలో పలువురు ఆర్‌బీఎస్ నాయకులు ఏఎస్పీని కలిసి వినతిపత్రం అందచేశారు. తిరుమల తిరుపతి పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పదవుల్లో ఉన్నప్పుడు గుర్తుకురాని ఆరోపణలు ఇప్పుడు చేయడంలో రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. ఎంతో కాలంగా ప్రధాన అర్చకుడిగా పని చేసిన రమణ దీక్షితులు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆరోపణలు చేయాలే గానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.